శనివారం, 30 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఉమెన్ స్పెషల్
Written By kowsalya
Last Updated : బుధవారం, 9 మే 2018 (18:54 IST)

మాతృదేవోభవా... #MothersDay గురించి....

మాతృదేవోభవా, పితృదేవోభవా, ఆచార్య దేవోభవా అంటూ తొలిపదం తల్లికే ఇచ్చారు. అమ్మా, నాన్నను సమానంగా సృష్టించినా అమ్మ ప్రేమను వెలకట్టలేము. ఎన్ని యుగాలు మారినా, ఎన్ని తరాలు దాటినా, ఏ దేశమేగినా, ఎక్కడ ఉన్నా అమ

మాతృదేవోభవా, పితృదేవోభవా, ఆచార్య దేవోభవా అంటూ తొలిపదం తల్లికే ఇచ్చారు. అమ్మా, నాన్నను సమానంగా సృష్టించినా అమ్మ ప్రేమను వెలకట్టలేము. ఎన్ని యుగాలు మారినా, ఎన్ని తరాలు దాటినా, ఏ దేశమేగినా, ఎక్కడ ఉన్నా అమ్మ ప్రేమలో మార్పు ఉండదు.


తన ఆయువునే ఆరోప్రాణంగా మలచి జన్మనిచ్చి, పసి వయస్సులో తొలిపరచియమై బుడిబుడి నడకలు నేర్పి, మమకారం ఆత్మీయతను పంచుతూ, గోరుముద్దలు తినిపిస్తూ అన్నీ తానై ప్రేమకు ప్రతిరూపంగా నిలిస్తున్న అమ్మ రుణం తీర్చుకోలేనిది. ముఖ్యంగా టీనేజ్ వయస్సులోని పిల్లలతో తల్లి స్నేహంగా ఉంటూ వారికి ఏమి కావాలో తెలుసుకుని అన్నీ తానై వారి భవిష్యత్‌కు బంగారుబాటలు వేస్తుంది. 
 
ఇందులో అమ్మ పాత్ర మరువలేనిది. అందుకే అమ్మకు కూడా ఒక పండుగను నిర్వహించుకునేందుకు గాను ప్రతి మే నెల రెండో ఆదివారిం ప్రపంచ వ్యాప్తంగా మదర్స్‌ డేను నిర్వహిస్తున్నారు. గ్లోబలీకరణ పెరిగిపోతున్న నేపథ్యంలో మదర్స్‌డే ప్రాముఖ్యత పెరిగిపోయింది.

మదర్స్‌ డే గురించి పలు వెబ్‌సైట్లలో, అన్ని భాషల్లో ఎన్నో వేల కొటేషన్లు దర్శనమిస్తున్నాయి. మదర్స్‌ డే రోజున పిల్లలు తమ తల్లికి అందమైన గ్రీటింగ్‌ కార్డులు, పలు రకాల బహుమతులను అందజేసి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వంద సంవత్సరాల క్రితమే ప్రారంభమైన ఈ మదర్స్‌ డే ప్రాముఖ్యం పట్టణాల నుండి ఇప్పుడిప్పుడే గ్రామాల్లోకి విస్తరిస్తోంది. మదర్స్‌ డే రోజున పిల్లలు తమ తల్లితండ్రులతో కలసి విందులు, వినోదాలు చేసుకోవడం, బహుమతులు ఇవ్వడం ఒక ఆనవాయితీగా మారింది. 
 
ప్రపంచమే కుగ్రామమైన ఈ రోజుల్లో మదర్స్‌ డేను కార్పొరేట్‌ సంస్థలు కమర్షియల్‌గా మార్చివేశాయి. మదర్స్‌ డే సందర్భంగా భారీ స్థాయిలో పిల్లలు తమ తల్లులకు పెద్దపెద్ద బహుమతులను అందిస్తున్నట్లుగా టీవి, యాప్స్‌, ఫేస్‌బుక్‌లో ప్రచారం చేస్తూ సామాన్య పిల్లలకు కూడా తమ తల్లులకు అదే స్థాయిలో బహుమతులను అందించాలనే ఆలోచనలు రేకితిస్తున్నారు.