శుక్రవారం, 19 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024
Written By ఐవీఆర్
Last Updated : గురువారం, 2 మే 2024 (22:06 IST)

ఏపీలో 14 సమస్యాత్మక నియోజకవర్గాలున్నాయన్న EC: 100% వెబ్ కాస్టింగ్‌తో పాటు CRPF బలగాలు

Jagan
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మే 13న జరుగనున్నాయి. ఈ నేపధ్యంలో ఎన్నికల సంఘం బృందం నియోజకవర్గాల వారీగా పర్యటించి సమస్యాత్మక నియోజకవర్గాలను గుర్తించింది. రాష్ట్రవ్యాప్తంగా 14 సమస్యాత్మక నియోజకవర్గాలను ప్రకటించింది. ఈ నియోజకవర్గాల్లో 100% వెబ్‌కాస్టింగ్‌ వుంటుందని తెలిపింది. అలాగే ఈ నియోజకవర్గాల్లో CRPF బలగాలు భారీ సంఖ్యలో దిగుతాయి. సమస్యాత్మక నియోజకవర్గాల్లో సీఎం జగన్ నుదుటిపై రాయితో దాడి చేసిన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంతో పాటు మొత్తం 14 వున్నాయి. ఇవే ఆ 14...
 
1) మాచర్ల
2) వినుకొండ
3) గురజాల
4) పెదకూరపాడు
5) ఒంగోలు
6) ఆళ్లగడ్డ
7) తిరుపతి
8) చంద్రగిరి
9) విజయవాడ సెంట్రల్
10) పుంగనూరు
11) పలమనేరు
12) పీలేరు
13) రాయచోటి
14) తంబళ్లపల్లె