1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 11 మే 2024 (22:22 IST)

సభ్యసమాజానికి ఏం సందేశం ఇస్తున్నట్లు? ఆయనంతే 'పుష్ప' కదా?

Allu Arjun
ఏపీ రాజకీయాలు చాలా వేడిగా వున్నాయి. ఒకవైపు కూటమి ఇంకోవైపు వైసిపి. కూటమిలో కీలకంగా వ్యవహరిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఏపీ ప్రజలను పట్టి పీడిస్తున్న జగన్ సర్కారుని అధఃపాతాళ లోకానికి తొక్కేస్తామంటూ ఆయన ప్రతిజ్ఞ చేస్తున్నారు. ఏపీ యువత భవిష్యత్తు బాగు పడాలంటే వైసిపి పోవాలంటూ అలుపెరగకుండా సభలు, సమావేశాలు పెడుతూ గత కొన్నిరోజులుగా మండుటెండల్లో తిరుగుతున్నారు. ఇక ఈరోజు ప్రచారాలకు తెరపడే ఆఖరు రోజు.
 
జన సేనాని బాగా అలసినట్లు కనబడ్డారు. కాకినాడ సభకు సిద్ధమవుతున్న తరుణంలో నంద్యాలలో అల్లు అర్జున్ ప్రత్యక్షమయ్యారు. అదేదో తన మావయ్య పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు మద్దతుగా ప్రచారం చేస్తున్నారేమో అనుకుంటే... కూటమికే షాకిస్తూ వైసిపి శిబిరంలో కనబడ్డారు. పైగా నాకు పార్టీలు, గీర్టీలు ఏమీ వుండవు. ఏ పార్టీకి చెందినవారైనా నా స్నేహితులు వున్నప్పుడు వారికి నేను విషెస్ చెబుతానంటూ వెల్లడించారు.
 
Allu Arjun
కర్టెసి-ట్విట్టర్
కానీ అల్లు అర్జున్ చేసిన పనికి... కూటమి పార్టీలు షాకవగా, మెగా అభిమానులు మోతమోగిస్తున్నారు. అల్లు అర్జునా... ఈ పని చేసి సభ్యసమాజానికి మీరు ఏం సందేశం ఇస్తున్నట్లు అంటూ సెటైర్లు వేస్తున్నారు. మొత్తమ్మీద చివరి రోజున మెగా ఫ్యామిలీకి గట్టి షాకే ఇచ్చారు ఐకన్ స్టార్ అల్లు అర్జున్. ఆయనంతే... పుష్ప కదా?!!