శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: సోమవారం, 15 నవంబరు 2021 (22:05 IST)

తిరుపతిలో బిజెపి జాతీయ నేతలతో అమిత్ షా భేటీ, ఏం జరిగిందంటే..?

మూడు రోజుల పర్యటనలో అమిత్ షా బిజీబిజీగా గడిపారు. ఎక్కడా ఖాళీ లేకుండా చిత్తూరు, నెల్లూరు జిల్లాలో పర్యటించారు. మూడవరోజు ఎపిపై ప్రత్యేక దృష్టి పెట్టిన అమిత్ షా పార్టీని బలోపేతం చేయాలన్న అంశంపైనే నేతలతో ప్రధానంగా చర్చించారు.
 
తిరుపతిలోని తాజ్ హోటల్లో బిజెపి జాతీయ నాయకులతో సమావేశమయ్యారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఎపిలో బిజెపిని బలోపేతం చేయాలని నేతలను ఆదేశించారు. అమిత్ షాతో భేటీ తరువాత మీడియాతో బిజెపి ఎపి అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో ఎపిలో బిజెపిని అధికారంలోకి తీసుకురావాలని అమిత్ షా ఆదేశించినట్లు చెప్పారు. 
 
ఎపి అభివృద్థికి కేంద్రం సహాయం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారని.. ఎపికి అవసరమైన నిధులను ఇస్తామన్నారు. ఎపిలో వైసిపిపై వ్యతిరేకత మొదలైందన్న విషయాన్ని అమిత్ షా దృష్టికి తీసుకెళ్ళామని.. ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తామన్నారు సోము వీర్రాజు.