మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 28 ఆగస్టు 2020 (14:06 IST)

ఈఎస్ఐ స్కాం.. అచ్చెన్నాయుడికి బెయిల్ మంజూరు

ఈఎస్ఐ స్కాంలో అరెస్ట్ అయి జైలులో ఉన్న అచ్చెన్నాయుడికి బెయిల్ మంజూరు అయింది. అయితే కోర్టు అనుమతి లేనిదే దేశం విడిచి వెళ్లరాదని పేర్కొంది. అచ్చెన్నాయుడు బెయిల్‌ పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో రెండు రోజుల క్రితమే వాదనలు ముగిశాయి. వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్‌ చేసింది. ఈఎస్‌ఐ స్కామ్‌ కేసులో అచ్చెన్నాయుడుని అరెస్ట్ చేసింది.
 
ఏసీబీ వైద్య పరికరాలు, మందుల కొనుగోలు కుంభకోణంలో డీలర్ల నుంచి అచ్చెన్నాయుడికి డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఇక, మొదట ఏసీబీ కోర్టులో బెయిల్ కోసం ప్రయత్నాలు చేసిన అచ్చెన్నాయుడు... అక్కడ బెయిల్ రాకపోవడంతో... హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అయితే కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లొద్దని ఆదేశించారు. 
 
ఇవాళ, రేపట్లో ఆయన బెయిల్‌పై విడుదలకానున్నారు. ఈఎస్‌ఐ స్కాంలో అరెస్టైన అచ్చెన్న అనారోగ్య కారణాలతో ఆస్పత్రిలో చేరారు. ఇటీవల కరోనా పాజిటివ్ రాగా.. ప్రస్తుతం ఆయన ఎన్‌ఆర్ఐ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 
 
విలువైన మందులు, వైద్య పరికరాల కొనుగోలులో 150 కోట్లపైన అవినీతి అక్రమాలు జరిగినట్టు ప్రాథమికంగా నిర్దారించారు. ఈ అక్రమాలలో ప్రభుత్వ అధికారులు ప్రైవేటు వ్యక్తులతో కుమ్మకై ప్రభుత్వానికి నష్టం కలిగించినట్లు తేల్చారు. ఇప్పటివరకు ప్రభుత్వ అధికారులు మరియు ప్రైవేటు వ్యక్తులు కలిపి 19 మంది ప్రమేయం గుర్తించారు.
 
ఈఎస్‌ఐ కుంభకోణంలో మాజీ మంత్రి, టెక్కలి ఎమ్మెల్యే కె.అచ్చెన్నాయుడితో పాటూ మరో మరికొందరు అరెస్ట్ అయ్యారు. అప్పటి నుంచి బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.. ఇప్పుడు ఊరట లభించింది.