శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 11 డిశెంబరు 2023 (22:55 IST)

ఏపీకి పొంచివున్న మరో తుఫాన్.. భయపడుతున్న రైతులు

mocha cyclone
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మిచౌంగ్ తుఫాను అతలాకుతలం చేసింది. దక్షిణ కోస్తా తీర జిల్లాల్లో అపార నష్టాన్ని చేకూర్చింది. ముఖ్యంగా రైతులను కోలుకోకుండా దెబ్బతీసింది. చేతికి వచ్చిన వంట వరద నీటిలో మునిగిపోయింది. దీంతో రైలుతు లబోదిబో మంటున్నారు. ఈ నష్టం నుంచి కోలుకోకముందే, ఏపీకి మరో తుఫాను గండం పొంచివుంది. బంగాళాఖాతంలో రానున్న 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడనుంది. 
 
దీని ప్రభావం కారణంగా వచ్చే ఐదు రోజుల్లో కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆగ్నేయ అరేబియాలో తుఫాను వాతావరణం నెలకొనివుందని తెలిపింది. ఇది మాల్దీవులకు సమీపంలో సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉందని, దీంతో అల్పపీడనం ఏర్పడుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. 
 
దీని ఫలితంగా వచ్చే ఐదు రోజుల పాటు కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, లక్షద్వీప్‌ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ముఖ్యంగా, దీని ప్రభావం ఎక్కువగా కేరళపై ఉంటుందని తెలిపింది. అదేసమయంలో తమిళనాడు, కేరళ, కర్నాటక రాష్ట్రాలను దాటుకుని ఏపీకి రావడానికి కొంత సమయం పడుతుందని పేర్కొంది. ఈ అల్పపీడనం తుఫానుగా మారి ఏపీ వైపుగా వస్తే ఈ నెల 21 నుంచి 25వ తేదీ వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.