Daily Horoscope
✕

ఈ నెల 21 నుంచి ఏపీ అసెంబ్లీ వ‌ర్షా కాల స‌మావేశాలు....5 రోజులే!

Updated: శనివారం, 4 సెప్టెంబరు 2021 (14:51 IST)
ఈనెల 21 లేదా 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. వారం రోజులు లేదా 5 పనిదినాలు ఈ సమావేశాలు ఉండనున్నట్లు అధికారులు చెబుతున్నారు. తిరిగి డిసెంబరులో మరోసారి అసెంబ్లీ సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.
 
అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను ఈ నెల 21 లేదా 22 నుంచి ప్రారంభించే అవకాశం ఉందని తెలిసింది. వారం రోజులు లేదా 5 పనిదినాలు ఉండేలా ఈ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. తిరిగి డిసెంబరులో మరోసారి సమావేశాలను నిర్వహించే అవకాశం కూడా ఉన్నట్లు తెలిసింది. ఈ నెలలోనే ఒకేసారి ఎక్కువ రోజులు సమావేశాలు నిర్వహించడం కంటే. ఈ నెలలో ఐదు రోజులు, డిసెంబర్​లో మరో ఐదు లేదా వారం రోజులు నిర్వహిస్తే బాగుంటుందన్న ప్రతిపాదన ఉన్నట్లు సమాచారం.
 
దీనిపై ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయానికి రావాల్సి ఉంది. మరోవైపు ఈ నెలలో అసెంబ్లీ సమావేశాల సమయంలోనే శాసనమండలి ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్​ల ఎన్నికలు నిర్వహించాలని గతంలో ప్రాథమికంగా నిర్ణయించినప్పటికీ, ఇప్పుడు దీనిపై పునరాలోచిస్తున్నట్లు తెలిసింది. స్థానిక సంస్థల కోటాలో 11 ఎమ్మెల్సీల ఖాళీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. వీటికి ఎన్నికలు జరిగితే దాదాపు అన్ని స్థానాలను దక్కించుకునే అవకాశం ఉందని అధికార వైకాపా అంచనా వేస్తోంది. అలా సాధించి సంపూర్ణ మెజారిటీతో శాసన మండలిలో ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికలకు వెళ్తే బాగుంటుందన్న ప్రతిపాదనపై చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది.

అన్నీ చూడండి

తొలి సినిమాతోనే బ్లాక్‌బస్టర్ దర్శకుడిగా సత్తా చాటిన జానకిరామ్ మారెళ్ల

రౌడీ జనార్థన మూవీ నుంచి కీర్తి సురేష్ బర్త్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్

యూట్యూబ్ సెన్సేషన్ అజయ్ (ఏయ్ జూడ్) హీరోగా కొత్త సినిమా

Nagavamsi: తెలుగునాట జైలర్ 2 ప్రభంజనంపై సంతోషం వ్యక్తం చేసిన సూర్యదేవర నాగవంశీ

Dulquer Salmaanఫ ఆకాశంలో ఒక తార నుంచి రోలర్‌కోస్టర్ రైడ్‌ టీజర్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments