1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 23 డిశెంబరు 2021 (15:26 IST)

కబడ్డీ ఆటగాడిని ఔట్ చేయబోయి బోర్లాపడిన స్పీకర్ తమ్మినేని

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సభాపతి తమ్మినేని సీతారాం బోర్లాపడ్డారు. కబడ్డీ ఆటగాడిని ఔట్ చేయబోయి బోర్లాపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో కబడ్డీ పోటీలను నిర్వహించారు. వీటిని సబాపతి తమ్మినేని సీతారాం ప్రారంభించారు. ఆ తర్వాత ఆయన కబడ్డీ అవతారమెత్తాడు. 
 
ఒక జట్టు తరపున కూతకు వెళ్లారు. ముగ్గురిని ఔట్ చేశారు. నాలుగో వ్యక్తిని ఔట్ చేసే ప్రయత్నంలో అదుపతప్పి కాలు జారి బోర్లాపడ్డారు. ఆ వెంటనే సందర్శకులతో పాటు సెక్యూరిటీ సిబ్బంది ఆయన్ను పైకి లేపారు. అయితే, ఆయనకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.