బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 23 మార్చి 2018 (13:54 IST)

బీజేపీకి, కేసులకు మేం భయపడాలా? ముప్పేట దాడి చేస్తున్నారు...

భారతీయ జనతా పార్టీకి లేదా కేసులకు మేం భయపడాలా అంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. అంతేకాకుండా, బీజేపీ, వైకాపా, జనసేన పార్టీలు కలిసి నాపై ముప్పేట దాడి చేస్తున్నాయని ఆరోపించారు.

భారతీయ జనతా పార్టీకి లేదా కేసులకు మేం భయపడాలా అంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. అంతేకాకుండా, బీజేపీ, వైకాపా, జనసేన పార్టీలు కలిసి నాపై ముప్పేట దాడి చేస్తున్నాయని ఆరోపించారు. ఈ మహా కుట్రపై ఇప్పుడు ప్రతి గ్రామంలో చర్చ జరుగుతోందని చెప్పుకొచ్చారు. అయితే, ఎవరు ఎన్ని కుట్రలు చేసినా వెనకంజ వేసే సమస్యే లేదని ఆయన తేల్చి చెప్పారు. 
 
ఇదే అంశంపై చంద్రబాబు మాట్లాడుతూ, మూడు పార్టీలు కలిసి నాపైనా, లోకేశ్‌పైనా, మంత్రులపైనా ఆరోపణలు గుప్పిస్తున్నాయి. టీడీపీపై బురద చల్లడం వాటి ఉమ్మడి ఎజెండా. ఇటువంటి కుట్రలు, కక్షసాధింపు చర్యలు ఇంకా పెరుగుతాయి. అన్నింటికీ, అందరూ సిద్ధంగా ఉండాలి. ప్రజలను చైతన్యపర్చాలి. ప్రజలే మనకు కొండంత అండ. అంతిమ విజయం మనదే అంటూ పార్టీ నేతలకు, శ్రేణులకు పిలుపునిచ్చారు.