గురువారం, 29 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 9 సెప్టెంబరు 2022 (14:42 IST)

అమరావతి రైతుల మహాపాదయాత్రకు హైకోర్టు పచ్చజెండా

ఈ నెల 12వ తేదీ నుంచి అమరావతి రాజధాని ప్రాంత రైతులు చేపట్టాదలచిన మహా పాదయాత్రకు ఏపీ హైకోర్టు అనుమతి ఇచ్చింది. పరిమిత ఆంక్షలతో రైతులు పాదయాత్రను చేసుకోవచ్చని తెలిపింది. అదేసమయంలో పోలీసులకు తక్షణమే దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. రైతులు దరఖాస్తును పరిశీలించి అనుమతి ఇవ్వాలంటూ ఏపీ పోలీసులను కూడా హైకోర్టు ఆదేశించింది. 
 
కాగా, ఈ మహా పాదయాత్ర చేయడం వల్ల రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని చెప్పి ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి అనుమతి నిరాకరిస్తూ గురువారం అర్థరాత్రి ఉత్తర్వులు జారీచేశారు. ఈ నేపథ్యంలో రైతులు హైకోర్టును ఆశ్రయించారు. అమరావతి పరిరక్షణ సమితి తరపున ఈ పిటిషన్ దాఖలైంది. రైతులు వేసిన పిటిషన్‌ను శుక్రవారం మొదటి కేసుగా విచారణకు స్వీకరించి పరిమిత ఆంక్షలతో పాదయాత్రకు అనుమతి ఇచ్చింది.