శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 17 జూన్ 2022 (11:16 IST)

నేడు ఏపీలో ఇంటర్ పరీక్షా ఫలితాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేడు ఇంటర్ పరీక్షా ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ యేడాది గత మే నెల ఆరో తేదీ నుంచి 24వ తేదీ వరకు ఈ పరీక్షలు జరిగిన విషయం తెల్సిందే. ఈ పరీక్షలకు మొత్తం 4,64,756 మంది హాజరయ్యారు. ఈ ఫలితాలను ఇంటర్ బోర్డు శుక్రవారం వెల్లడించనుంది. ఫలితాలను bse.ap.gov.in అనే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనుంది. 
 
ఈ ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థులకు డిజిటల్ స్కోరు కార్డు ఇవ్వనున్నారు. ఇంటర్ మొదటి, రెండు సంవత్సరాల్లో ఉత్తీర్ణులు సాధించాలంటే ప్రతి సబ్జెక్టులోనూ 33 కంటే ఎక్కువ మార్కులు సాధించాల్సి ఉంటుంది. 90 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు ప్రభుత్వం ఉపకారవేతనానికి అర్హులవుతారు.