బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 27 జూన్ 2018 (10:04 IST)

భవిష్యత్‌లో బీజేపీకి అష్టకష్టాలే : రాందేవ్ జోస్యం

యోగా గురువు బాబా రాందేవ్ జోస్యం చెప్పారు. భారతీయ జనతా పార్టీకి ఎంతో అనుకూలంగా ఉండే ఈయన... ఆ పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్‌లో కమలనాథులకు కష్టాలు తప్పవని హెచ్చరించారు.

యోగా గురువు బాబా రాందేవ్ జోస్యం చెప్పారు. భారతీయ జనతా పార్టీకి ఎంతో అనుకూలంగా ఉండే ఈయన... ఆ పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్‌లో కమలనాథులకు కష్టాలు తప్పవని హెచ్చరించారు.
 
ముఖ్యంగా, దేశంలోని ఓబీసీలు, దళితులు, ముస్లింలు ఏకమైతే ఎదుర్కోవడం బీజేపీకి కష్టమేనన్నారు. అలా జరిగే అవకాశాలు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయన్నారు. 
 
దేశంలో ఎవరైనా ప్రధాని కావచ్చని, రాజ్యాంగంలోనే అది రాసి ఉందని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీని ఉద్దేశించి అన్నారు. ప్రజలు మాత్రం తాము ఎవరిని కోరుకుంటే వారినే ప్రధానిని చేస్తారన్నారు. 
 
వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి కష్టాలు తప్పకపోవచ్చన్నారు. యోగా శిక్షణ ఇచ్చేందుకు లండన్‌ వచ్చిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.