ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 24 జులై 2019 (19:25 IST)

ఎలక్ట్రానిక్ విట్నెసింగ్ సిస్టం ప్రారంభం.. దేశంలోనే ప్రప్రథమంగా విజయవాడలో ఏర్పాటు

ఐవీఎఫ్ చికిత్సలు పూర్తి పారదర్శకంగా నిర్వహించేందుకు ఒయాసిస్ నిరంతరం కృషి చేస్తోంది. ఐవీఎఫ్ చికిత్సా విధానంలో పొరపాట్లు జరిగేందుకు అవకాశం లేకపోయినప్పటికీ, సంతాన సాఫల్య చికిత్స కోసం వచ్చే వారికి సహజంగా అనేక సందేహాలుంటాయి. అటువంటి సందేహాలన్నింటికీ సమాధానంగా ఎలక్ట్రానిక్ విట్నెసింగ్ సిస్టంను ఒయాసిస్ అందుబాటులోకి తీసుకొచ్చింది. 
 
వరల్డ్ ఐవీఎఫ్ డే సందర్భంగా ఈడబ్ల్యూఎస్ ను ప్రారంభిస్తున్నట్లు ప్రఖ్యాత సంతాన సాఫల్య చికిత్స నిపుణులు, ఒయాసిస్ క్లినికల్ హెడ్ డాక్టర్ వెల్లంకి సుజాత తెలిపారు. నగరంలోని ఒయాసిస్ రీప్రొడక్టివ్ మెడిసిన్ సెంటర్ నందు బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఒయాసిస్ సెంటర్ నందు సంతాన సాఫల్య చికిత్సలో అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని, ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా ఐవీఎఫ్ చికిత్స అందిస్తామని వివరించారు. 
 
అత్యంత పారదర్శకంగా ఐవీఎఫ్ చికిత్స అందించడంలో భాగంగా దేశంలోనే ప్రప్రథమంగా ఎలక్ట్రానిక్ విట్నెసింగ్ సిస్టంను అందుబాటులోకి తెచ్చామన్నారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన వెబ్  బేస్డ్ సాఫ్ట్ వేర్ ద్వారా మానవ తప్పిదాలకు తావులేకుండా ఐవీఎఫ్ చికిత్సలు నిర్వహించవచ్చని తెలిపారు. ఐవీఎఫ్ చికిత్సలో ప్రతి ఒక్క దశను ఈ అత్యాధునిక ట్రాక్ అండ్ ట్రేస్ సిస్టం విశ్లేషిస్తుందని, తద్వారా లోపాలను ఎప్పటికప్పుడు గుర్తించి నాణ్యమైన చికిత్స అందించే అవకాశం లభిస్తుందని వివరించారు. 
 
ఈడబ్ల్యూఎస్ ద్వారా ఐవీఎఫ్ చికిత్స తీసుకునేవారికి మరింత నమ్మకం కలుగుతుందని, ఐవీఎఫ్ చికిత్సలో ఇదో మైలురాయి అని డాక్టర్ వెల్లంకి సుజాత పేర్కొన్నారు. తొలి టెస్ట్ ట్యూబ్ బేబీ లూయిస్ బ్రౌన్ జన్మదినమైన జూలై 25వ తేదీని వరల్డ్ ఐవీఎఫ్ డే గా జరుపుకుంటున్నామని, వరల్డ్ ఐవీఎఫ్ డే నాడు ఒయాసిస్ లో ఎలక్ట్రానిక్ విట్నెసింగ్ సిస్టంను ప్రారంభించడం సంతోషంగా ఉందని ఆమె తెలిపారు.
 
41వ పుట్టినరోజు జరుపుకుంటున్న లూయిస్ బ్రౌన్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఏడు మిలియన్ల మంది ఐవీఎఫ్ ద్వారా జన్మించారని, సంతానలేమికి అత్యుత్తమ పరిష్కారంగా ఐవీఎఫ్ నిలుస్తోందని అన్నారు. సద్గురు హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా నిర్వహించబడుతున్న ఒయాసిస్ సెంటర్ ఫర్ రీప్రొడక్టివ్ మెడిసిన్ నందు అంతర్జాతీయస్థాయి చికిత్సలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.
 
సంతాన లేమికి గల కారణాలను సమగ్రంగా విశ్లేషించి కచ్చితమైన చికిత్స అందించడం ఒయాసిస్ ప్రత్యేకత అని డాక్టర్ సుజాత పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లోని 9 సెంటర్ల ద్వారా అత్యధిక సక్సెస్ రేటుతో ఐవీఎఫ్ చికిత్సలు అందిస్తున్న ఘనత ఒయాసిస్ సొంతమని ఆమె తెలియజేశారు.