ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 3 నవంబరు 2022 (17:43 IST)

పవన్ కళ్యాణ్‌కు హాని తలపెడితే బీజేపీ చూస్తూ ఊరుకోం.. సోము వీర్రాజు

somu veerraju
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు ప్రాణహాని తలపెడితే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదని ఆ పార్టీ ఏపీ శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు హెచ్చరించారు. హైదరాబాద్ నగరంలోని పవన్ కళ్యాణ్ నివాసం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు రెక్కీ నిర్వహించారంటూ జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
వీటిపై సోము వీర్రాజు మాట్లాడుతూ, పవన్‌కు హాని తలపెడితే బీజేపీ చూస్తూ ఊరుకోదంటూ హెచ్చరికలు చేశారు. హైదరాబాద్ నగరంలోని పవన్ ఇంటి వద్ద రాత్రి సమయంలో ఇద్దరు వ్యక్తులు వచ్చి పవన్ బౌన్సర్లతో గొడవ పడ్డ వైనాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. 
 
పవన్ ఇంటి వద్దకు వచ్చిన అపరిచితులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీలో బీజేపీ, జనసేన మిత్రపక్షాలుగా ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. దీంతో పవన్ కళ్యాణ్‌కు హాని ఉందంటూ వస్తున్న వార్తలపై సోము వీర్రాజు స్పందించారు.