శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 2 నవంబరు 2024 (16:53 IST)

పవన్ డాటర్స్.. ట్రోల్స్ తాటతీయనున్న ఏపీ సర్కారు

pawan kalyan
సోషల్ మీడియాలో ప్రముఖ వ్యక్తులను దుర్భాషలాడుతూ ట్రోల్ చేస్తున్న నెటిజన్లపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు కఠిన చర్యలు తీసుకోనుంది. తాజాగా ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, ఆయన కుటుంబసభ్యులపై అవమానకర, అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై విజయవాడ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పవన్ కళ్యాణ్ కుమార్తెల చిత్రాలను షేర్ చేస్తూ నిందితులు కించపరిచే విధంగా పోస్ట్ చేశారంటూ జనసేన ప్రాంతీయ సమన్వయకర్త మల్లెపు జయలక్ష్మి విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. 
 
ఐటీ చట్టంలోని సెక్షన్‌ 66, 66సీ, 67తో పాటు బీఎన్‌ఎస్‌ 79, క్లాజ్‌ 353 (2) కింద పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ ప్రారంభించామని, ప్రస్తుతం నిందితుల వివరాలు సేకరిస్తున్నామని పోలీసులు తెలిపారు. 
 
ఇటీవల పవన్ కళ్యాణ్ తన కుమార్తెలు ఆరాధ్య, పోలేనా అంజనా పవనోవాతో కలిసి తిరుమల ఆలయాన్ని సందర్శించారు. దీంతో పవన్ తొలిసారిగా ఇద్దరు కూతుళ్లతో కలిసి కనిపించారు.