ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 30 అక్టోబరు 2024 (11:29 IST)

పవన్ కళ్యాణ్ వీర అభిమాని.. విజయవాడ టు కలకత్తా.. పాదయాత్ర (video)

pawan kalyan fan
pawan kalyan fan
దుర్గా మల్లేశ్వరరావు పవన్ కళ్యాణ్ వీర అభిమాని. ఇతను కూలి పని చేస్తూ జీవితం సాగిస్తున్నాడు. అయితే పవన్‌పై అభిమానంతో ఆయన ఎన్నికల్లో గెలిస్తే.. విజయవాడ నుండి కలకత్తా కాళీమాత గుడి వరకు కాలి నలుగుతూ వస్తానని చెప్పి మొక్కుకున్నాడు. 
 
గత ఎన్నికలలో పవన్ కళ్యాణ్ అత్యధిక మెజార్టీతో గెలవటమే కాకుండా. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడంతో దుర్గా మల్లేశ్వర రావు అనుకున్న మొక్కుబడి తీర్చటానికి ఈనెల ఐదో తారీఖున ఉదయం విజయవాడ నుండి కలకత్తా కాలినడకతో వెళ్ళటం జరిగింది. 
 
ఇప్పటికీ 1000 కిలోమీటర్లు.. నడక కొనసాగించారు. ఇంకా 300 కిలోమీటర్లు ప్రయాణం పూర్తయి.. కాళీమాత దర్శనం చేసుకొని.. అనంతరం తను అభిమానించే పవన్ కళ్యాణ్ గారిని కలవాలని. ఆయన ఆశీర్వాదం తీసుకోవాలని కోరిక ఉందని చెప్పుకొచ్చాడు. 
 
ప్రస్తుతం దుర్గా మల్లేశ్వరరావు కలకత్తా పాదయాత్రకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.