ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 28 అక్టోబరు 2024 (17:45 IST)

సాయిపల్లవికి పెద్ద అభిమానిని... కలిసి పనిచేస్తాం : మణిరత్నం కామెంట్స్

maniratnam
సహజ నటిగా గుర్తింపు పొందిన సాయిపల్లవికి సినిమా ప్రేక్షకులు మాత్రమే కాదు సినీ ప్రముఖులు కూడా అభిమానులుగా మారిపోతున్నారు. తాజాగా స్టార్ డైరెక్టర్ మణిరత్నం సైతం ఆమెకు అభిమానిగా మారిపోయారు. శివకార్తికేయన్ నటించిన "అమరన్" చిత్రంలో సాయిపల్లవి హీరోయిన్. ఈ నెల 31వ తేదీన విడుదలకానుంది. ఈ చిత్రం ఆడియో రిలీజ్ వేడుక ఇటీవల చెన్నైలో జరిగింది. 
 
ఇందులో మణిరత్నం... హీరోయిన్ సాయిపల్లవి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సాయిపల్లవి నటనకు తాను పెద్ద ఫ్యాన్ అని చెప్పారు. ప్రతిభావంతురాలైన నటిగా ఆమెను చాలా ఇష్టపడతానని చెప్పారు. ఏదో ఒకనాడు తప్పకుండా ఆమెతో సినిమా తీస్తానని చెప్పారు. సహజంగానే తన పాత్రలకు జీవం పోసే సాయిపల్లవి.. ఇపుడు నిజంగానే రియల్ లైఫ్ పాత్రలో నటించారని, ఆ పాత్రకు మరింతగా ప్రాణంపోసివుంటారని భావిస్తున్నట్టు చెప్పారు.