RRR పైన సీబీఐ చీటింగ్ కేసు: రఘురామకృష్ణ రాజు ఇక మాట్లాడతారా?
బ్యాంకుల మోసానికి పాల్పడ్డారంటూ వైసిపి ఎంపీ రఘురామకృష్ణం రాజుపై సీబీఐ కేసు నమోదయ్యింది. పంజాబ్ నేషనల్ బ్యాంకు నేతృత్వంలోని కన్సార్షియం ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సీబీఐ వెల్లడించింది. మొత్తం రూ. 826.17 కోట్ల మేర మోసానికి పాల్పడినట్లు తమకు ఫిర్యాదు అందిందని వెల్లడించింది.
బ్యాంకుల మోసానికి పాల్పడి నిధులను దారిమళ్లించి దుర్వినియోగానికి పాల్పడ్డారనీ, హైదరాబాద్, ముంబై, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని 11 ప్రదేశాల్లో ఈ మేరకు సోదాలు నిర్వహించినట్లు ప్రెస్‌నోట్‌లో వెల్లడించింది. రఘురామకృష్ణంరాజు సహా 9 మందిపై సీబీఐ చీటింగ్ కేసు నమోదు చేసింది.
కాగా గత కొంతకాలంగా రఘురామకృష్ణ రాజు వైసిపిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన మీడియాలో RRRగా పాపులర్ కూడా అయ్యారు.