మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 12 అక్టోబరు 2019 (09:19 IST)

ఏపీ రాజధానిలో భూలావాదేవీలపై సీఐడీ ఆరా

రాజధాని అమరావతిలో జరిగిన భూముల లావాదేవీలపై సీఐడీ అధికారులు విచారణ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలు గ్రామాల్లో భూములు అమ్మిన రైతులతో మాట్లాడారు.

బృందాలుగా ఏర్పడి వెంకటపాలెం, రాయపూడి, తుళ్లూరు, నేలపాడు గ్రామాల్లో ఆరా తీస్తున్నారు. తాజాగా శుక్రవారం తుళ్లూరులో సీఐడీ డీఎస్పీ స్థాయి అధికారి తహశీల్దార్‌తో సమావేశం అయ్యారు.

రాజధానిలో జరీబు మెట్ట భూముల రిజిస్ట్రేషన్లు ఎలా జరిగాయి.. ఎంతమంది బయటి నుంచి వచ్చి కొనుగోలు చేశారనే దానిపై ఆయన్నుంచి వివరాలు సేకరించినట్లు తెలిసింది.

లంక భూముల కొనుగోళ్లపైనా సీఐడీ అధికారులు దృష్టిపెట్టినట్లు సమాచారం. లంక భూములను అమ్మినవారి నుంచి వివరాలు తీసుకుంటున్నారు.