గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 30 మార్చి 2021 (11:07 IST)

రిమ్స్‌లో నాగుపాము.. మెటర్నటీ వార్డులోకి వచ్చేసింది..

వన్య ప్రాణాలు ప్రస్తుతం జనవాసాల్లోకి రావడం ఫ్యాషనైపోయింది. తాజాగా ఆ పాములు కాస్త జన సంచారం అధికంగా వున్న ఆస్పత్రుల్లోకి వస్తే.. పరిస్థితి ఎలా వుంటుందో అర్థం చేసుకోవచ్చు. అదే జరిగింది. ఎక్కడంటే రిమ్స్‌లో నాగుపాము కలకలం రేపింది. ఎక్కడి నుంచి వచ్చిందో.. ఎలా వచ్చిందో తెలియదు కానీ మెటర్నటీ వార్డులోకి చొరబడిన నాగుపాము కాసేపు వార్డులో సంచరించింది. 
 
వార్డులో ఉన్న వారు బిగ్గరగా కేకలు వేయడంతో వారి శబ్ధానికి అక్కడి నుంచి బాత్రూమ్‌లోకి వెళ్లింది. బాత్రూమ్‌లో చెత్తాచెదారం ఉండడంతో ఎంత వెతికినా పాము దొరకలేదు. చివరకు వార్డు నుంచి రోగులను వేరే గదికి మార్చారు. కాగా రిమ్స్‌ అధికారుల నిర్లక్ష్యం వల్లే, తగిన చర్యలు తీసుకోకపోవడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని రోగులు, వారి బంధువులు వాపోతున్నారు. జిల్లా అధికారులు స్పందించాలని కోరుతున్నారు.