శుక్రవారం, 4 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 18 నవంబరు 2021 (15:41 IST)

ధాన్యాన్ని కొనుగోలు చేయాలి.. కాంగ్రెస్ నిరసన ప్రదర్శన

రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించాలన్న డిమాండ్‌తో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నిరసన చేపట్టింది. ఇందులో భాగంగా గురువారం పబ్లిక్‌ గార్డెన్స్‌ నుంచి వ్యవసాయశాఖ కమిషనరేట్‌ వరకు కాంగ్రెస్‌ పార్టీ నిరసన ప్రదర్శనను నిర్వహిస్తోంది. ఈ నిరసన కార్యక్రమం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో జరిగింది.
 
ఈ నిరసన ప్రదర్శనలో పెద్ద ఎత్తున రైతులు పాల్గొననున్నారు. వ్యవసాయశాఖ కమిషనరేట్‌ వరకు ప్రదర్శన అనంతరం  రైతులు పండించిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి వారిని ఆదుకోవాలంటూ వినతిపత్రం సమర్పించారు.