గురువారం, 19 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: మంగళవారం, 29 ఆగస్టు 2017 (14:42 IST)

డేరా బాబా గురించి సీఎం చంద్రబాబు నాయుడు ఏమన్నారంటే?

అమరావతి : రాష్ట్ర ప్రజలు అభివృద్ధినే కోరుకుంటున్నారని నంద్యాల ఉప ఎన్నిక ఫలితంతో తేలిపోయిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రభుత్వం ముందు నుంచి అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనకే ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ప్రజలు కూడా ప్రభుత్వానికి మద్ధతుగా నిలిచా

అమరావతి : రాష్ట్ర ప్రజలు అభివృద్ధినే కోరుకుంటున్నారని నంద్యాల ఉప ఎన్నిక ఫలితంతో తేలిపోయిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రభుత్వం ముందు నుంచి అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనకే ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ప్రజలు కూడా ప్రభుత్వానికి మద్ధతుగా నిలిచారని చెప్పారు. నంద్యాల ఉపఎన్నిక ఫలితం వెలువడిన తరవాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో విలేకర్లతో మాట్లాడారు. ఎవరు ఎన్ని అడ్ఢంకులు సృష్టించిన, ఆర్ధిక పరిస్థితులు సహకరించకపోయినా ఎన్నికల్లో ఇచ్చిన హమీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని ఆయన అన్నారు. 
 
అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే విద్యుత్ సమస్యను పరిష్కరించి, మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదద్దడం, పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను కృష్ణాతో అనుసంధానం చేయడం, పురుషోత్త పట్నం పూర్తి చేయడం, సుమారు 13వేల కిలో మీటర్లు సిమ్మెంటు రోడ్లు నిర్మించడం,  పెన్షన్ ను రూ. 1000కి పెంచడం, రైతులకు రుణ మాఫీ చేయడం, ఏ నెలకు ఆ నెల స్కాలర్ షిప్ లు ఇవ్వడం వంటి పనులు ప్రజలను ఆలోచింప చేశాయని అన్నారు. 
 
పట్టిసీమ ప్రాజెక్టను చేపట్టి పూర్తిచేయడం వల్లే రాయలసీమలో ఉద్యానవన పంటలు దెబ్బతినకుండా కాపాడగలిగామని ఆయన చెప్పారు. ప్రతిపక్ష నాయకులు చేసిన అసత్య ప్రచారాన్ని ప్రజలు తిప్పి కొట్టారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఉర్ధూ యూనివర్శిటీ ప్రారంభమై తరగతులు నిర్వహిస్తున్నా ఇంకా రాలేదనటం, ఓర్వకల్లులో ఎయిర్ పోర్ట్ పూర్తయిన లేదనటం, ప్రాజెక్టులు నిర్మించకుండా కేసులు వేయడం, నరేగా నిధులు రాకుండా ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదులు చేయడం వంటి ఘటనలు ప్రజల్లో ఆందోళన కలిగించాయని చెప్పారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా ప్రతిపక్ష నాయకుడు విశాఖలో సీఐఐ సదస్సును అడ్డుకునే ప్రయత్నం చేయడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోయారని ఆయన అన్నారు. 
 
ప్రజల మీద ఉన్న నమ్మకంతోనే ఎన్నికల సమయంలో నేరాలు, అవినీతి, ఆరాచకపాలనకు ఓటు వేస్తారో, అభివృద్ధి సంక్షేమం, సుపరిపాలనకు ఓటు వేస్తారో తేల్చుకోవాలని పిలుపు ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రజలు కూడా సానుకూలంగా స్పందించారని చెప్పారు. పట్టణంలోనే కాదు, గ్రామీణ ప్రాంతంలో కూడా టీడీపీకి మెజార్టీ వచ్చిందంటే ప్రజల్లో ప్రభుత్వం పట్ల ఉన్న సానుకూలతే కారణమని అన్నారు. ప్రతిపక్ష నాయకుడు బాధ్యత లేకుండా ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం వల్లే ఈ ఉప ఎన్నిక ఫలితంపై జాతీయస్థాయిలోనూ ఆసక్తి కలిగిందన్నారు. 
 
ఆ వ్యాఖ్యలను ఎన్నికల కమిషన్ తప్పుపట్టిన ప్రతిపక్ష నాయకుడు వాటిని సరిచేసుకోకుండా మరింత రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం ప్రజల్లో ఆందోళన రేకిత్తించిందన్నారు.ఎన్నికల కమిషన్ కూడా ప్రతిపక్ష నాయకుడు చేసిన వ్యాఖ్యలపై వెంటనే స్పందించకపోవడం బాధకరమని అన్నారు. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ మీద ఉందన్నారు. ప్రతిపక్ష నేత చేసిన కామెంట్లను ప్రజలు వ్యతిరేకించారని, ఆయన హద్దులు దాటి మాట్లాడారని అన్నారు. అభివృద్ధి పనులు జరుగుతుంటే ఏమీ లేవన్నవారికి నంద్యాల ప్రజలు ఓటుతో బుద్ది చెప్పారని అన్నారు. 
 
తరచు ఎన్నికలు జరగడం వల్ల అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. అందుకే కేంద్రప్రభుత్వం అన్ని ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలనే ఉద్ధేశ్యాన్ని తాము బలపర్చామని చెప్పారు. అలాగే, రాష్ట్రంలోనూ వివిధ ఎన్నికలు ఒకేసారి జరగాలని తాము భావిస్తున్నామని చెప్పారు. అంతే తప్పా తాము ఎన్నికలకు వ్యతిరేకం కాదన్నారు. ప్రభుత్వం అభివృద్ధిని కోరుకుంటుంటే, ప్రతిపక్షం ఎన్నికలను కోరుకుంటుందని ఆయన విమర్శించారు. 
 
డేరా బాబా మంచి సంస్థను చేతుల్లో ఉంచుకుని నమ్మిన మహిళల్ని మోసం చేశారని, సంస్థలో మిలిటెంట్స్‌ను తయారు చేశారని విమర్శించారు. సాధువు రూపంలో ఎన్ని దుర్మార్గాలు చేయాలో అన్ని చేశారని అన్నారు. ప్రతిపక్ష నాయకుడు కుటుంబం వల్లే అధికారులు, పారిశ్రామికవేత్తలు జైలుకు వెళ్లాల్సి వచ్చిందని గుర్తు చేశారు. రాష్ట్రానికి జాతీయస్థాయిలో చెడ్డపేరు వచ్చిందన్నారు. ఆల్మట్టి ప్రాజెక్టులోని నీటి వాడకం  మీద కోర్టుకి వెళ్లే విషయాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించామని చెప్పారు.