శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 5 జనవరి 2023 (09:22 IST)

వచ్చే ఎన్నికల్లో గెలిస్తే 30 యేళ్లు మనదే అధికారం : వైఎస్ జగన్మోహన్ రెడ్డి

avinash - jagan
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే మరో 30 యేళ్ల పాటు మనమే అధికారంలో ఉంటామని వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. ఆయన బుధవారం విజయవాడ తూర్పు నియోజకవర్గం కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైకాపా తరపున దేవినేని అవినాష్ బరిలోకి దించుతున్నానని, ఆయన్ను గెలిపించాల్సిన బాధ్యత మీదేనని చెప్పారు. 
 
అవినాష్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన తర్వాత సీఎం జగన్ మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో గెలిస్తే మరో 30 సంవత్సరాల పాటు వైసీపీకి తిరుగుండదు అన్నారు. ప్రతి ఇంటికి వెళ్లాలని నేతలకు చూసించారు. విభేదాలు ఉంటే పక్కనబెట్టి సమిష్టిగా పని చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి అందరికీ వివరించి ఆశీర్వాదం తీసుకోవాలని, వచ్చే ఎన్నికలను సీరియస్‌గా తీసుకోవాలని పార్టీ శ్రేణులకు జగన్ దిశానిర్దేశం చేశారు. 
 
అలాగే, వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ 152 కాదని 175కు 175 సీట్లు అన్ని, అన్ని సీట్లలో మనమే గెలవాలన్నారు. అలా గెలిచేలా ప్రతి ఒక్క నేత పార్టీ కోసం పని చేయాలని కోరారు. ఎన్నికలకు మరో 14 నెలల సమయం మాత్రమే ఉందని, రాష్ట్ర వ్యాప్తంగా 88 శాతం ఇళ్ళకు ఇప్పటికే మేలు చేశామన్నారు. నాకు ఎన్ని కష్టాలు ఉన్నప్పిటకీ బటన్ నొక్కే కార్యక్రమాన్ని మాత్రం సకాలంలో చేస్తున్నా.. మీరు చేయాల్సిన పని మీరూ చేయండి అంటూ పిలుపునిచ్చారు.