సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: బుధవారం, 28 జులై 2021 (15:19 IST)

దేవినేని ఉమాను ప్రజలు ఛీ కొట్టినా బుద్ధిమార లేదు

టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావును ప్రజలు ఛీ కొట్టినా బుద్ధిమారలేదని ఎమ్మెల్మే మల్లాది విష్ణు మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌ చేతిలో ఓటమిని దేవినేని ఉమా జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. మైనింగ్‌లో అక్రమాలు జరిగితే, అధికారుల దృష్టికి ఎందుకు తీసుకురాలేదని సూటిగా ప్రశ్నించారు.

దేవినేని ఉమా అనుచరులతో రాత్రిపూట పరిశీలనకు వెళ్తారా, దానిని ప్రశ్నిస్తే వైఎస్సార్‌సీపీ నేతలపై దాడి చేస్తారా అని మండిపడ్డారు. ఏదోరకంగా వసంత కృష్ణ ప్రసాద్‌పై బురదజల్లాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. దేవినేని ఉమా ఇలాంటి డ్రామాలు ఇకనైనా ఆపాలని హితవు పలికారు. గతంలో జక్కంపూడిలో దేవినేని ఉమాను ప్రజలే తరిమికొట్టారని గుర్తుచేశారు.

దేవినేని ఉమా రాజకీయ నాయకుడు కాదు.. గోబెల్స్ అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, దేవినేని ఉమా డ్రామా ఆర్టిస్ట్‌ల‌ని ఎమ్మెల్యే జోగి రమేష్‌ మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, దేవినేని ఉమా కాదు సొల్లు ఉమా అని ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు.

మైలవరంలో మొత్తం దోచుకున్నది దేవినేని ఉమానేనని, దేవినేని ఉమా మంత్రిగా ఉన్నప్పుడు పోలవరం మట్టి, గ్రావెల్‌ దోచుకున్నాడని దుయ్యబట్టారు. దేవినేని ఉమాపై ఎటువంటి దాడి జరగలేదని, దేవినేని ఉమాతో ఉన్న గూండాలే దాడికి తెగబడ్డారని అన్నారు.