మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : ఆదివారం, 17 అక్టోబరు 2021 (15:06 IST)

విద్యుత్ కోతలపై వదంతులను నమ్మవద్దు

విద్యుత్ కోతలపై సామాజికమాధ్యమాల్లో వచ్చే వదంతులను నమ్మవద్దని ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీఈపిడిసిఎల్) వినియోగదారులకు సంస్థ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ కె.సంతోషరావు విజ్ఞప్తి చేసారు.

దసరా పండగ తర్వాత నుంచి రాష్ట్ర వ్యాప్తంగా (పవర్ కట్) ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ అమల్లోకి వస్తాయని సామాజికమాధ్యమాల్లో వస్తున్నట్లు సిఎండి దృష్టికి రావడంతో అటువంటి కోతలేవీ లేవని సిఎండి కె.సంతోషరావు స్పష్టం చేసారు.

విద్యుత్ ఉత్పత్తికి అవసరమైనటువంటి బొగ్గు నిల్వలను రాష్ట్రప్రభుత్వం సమకూర్చడం వలన విద్యుత్ సరఫరాలో ఎటువంటి అంతరాయాలు లేవని సిఎండి పేర్కొన్నారు.

విద్యుత్ సరఫరా పరిస్థితిపై ఎటువంటి సమాచారం ఉన్నా సామాజిక మాధ్యమాల ద్వారా కాకుండా వినియోగదారులకు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అధికారకంగా తెలియచేస్తామన్నారు.