1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 9 ఫిబ్రవరి 2023 (13:51 IST)

ఏపీ - తెలంగాణాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్

election notification
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల కమిషన్ వెల్లడించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 15 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. వీటిలో త్వరలో ఖాళీ కాబోతున్న ఆరు స్థానాలతో పాటు ఇప్పటికే ఖాళీ అయిన 9 స్థానాలు ఉన్నాయి. ఈ స్థానాలకు ఈ నెల 16వ తేదీన నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. 
 
నామినేషన్ల దాఖలకు ఫిబ్రవరి 23వ తేదీని ఆఖరు గడువుగా ప్రకటించింది. నామినేషన్ల పరిశీలనకు ఫిబ్రవరి 24వ తేదీ వకు గుడువుగా నిర్ణయించారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నె 27వ తేదీన డెడ్‌లైన్‌గా నిర్ణయించారు. మార్చి 13వ తేదీన ఈ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. ఏపీలో మొత్తం 8 స్థానిక సంస్థలు, మూడు పట్టభద్రులు, 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. 
 
కాగా, ఏపీలో ఎమ్మెల్సీలు యండవల్లి శ్రీనివాసులు రెడ్డి, వెన్నపూస గోపాలరెడ్డి, దాన్, విఠపు బాలసుబ్రహ్మణ్యం, కత్తి నరసింహారెడ్డిల పదవీ కాలం ముగిసింది. అలాగే, తెలంగాణాలో కాతేపల్లి జనార్ధన్ రెడ్డి పదవీ కాలం కూడా ముగిసింది.