బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 22 సెప్టెంబరు 2018 (15:48 IST)

విదేశాల్లో విలాసాలు... లగ్జరీ హోటళ్లలో జల్సాలు... థాయ్‌లో మసాజ్‌లు

మల్టీలెవల్ మార్కెటింగ్ పేరుతో సుమారుగా 60 లక్షల మందిని వరకు మోసం చేసి వందల కోట్ల రూపాయలను కొల్లగొట్టిన కేటుగాళ్ళ వ్యవహారం బట్టబయలైంది. ఖరీదైన కార్లలో తిరుగుతూ, లగ్జరీ హోటళ్లలో జల్సాలు చేస్తూ, విదేశాల్

మల్టీలెవల్ మార్కెటింగ్ పేరుతో సుమారుగా 60 లక్షల మందిని వరకు మోసం చేసి వందల కోట్ల రూపాయలను కొల్లగొట్టిన కేటుగాళ్ళ వ్యవహారం బట్టబయలైంది. ఖరీదైన కార్లలో తిరుగుతూ, లగ్జరీ హోటళ్లలో జల్సాలు చేస్తూ, విదేశాల్లో విలాసాలు నేపాల్‌, థాయ్‌లాండ్‌లో మసాజ్‌లు చేయించుకుంటూ జీవితం అంటే ఇలావుండాలి అన్నట్టుగా ఎంజాయ్ చేశారు.
 
ఆ కేటుగాళ్లు ఇపుడు జైలు ఊచలు లెక్కిస్తున్నారు. వారు ఎవరో కాదు. ఫ్యూచర్‌ మేకర్‌ సంస్థ పేరుతో హెల్త్‌ ప్రొడక్టులను మార్కెటింగ్‌ చేస్తామంటూ అమాయక ప్రజలను నమ్మించి మోసం చేసిన రాధేశ్యామ్‌, సురేందర్‌ సింగ్‌, బన్సీలాల్‌. మల్టీలెవల్ మార్కెటింగ్ పేరుతో స్కీం పేరుతో భారీ స్కామ్‌కు తెరతీసి వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు. ఈ గజ మోసగాళ్లను ఇటీవల ఈవోడబ్ల్యూ పోలీసులు రంగప్రవేశం చేసి అరెస్టు చేశారు. 
 
వీరి గృహాల్లో సోదాలు నిర్వహించగా, రూ.60 లక్షల నగుదుతో పాటు ఖరీదైన వస్తువులు, బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే, ఒక పిస్తోలు, 10 బుల్లెట్లు, మూడు లగ్జరీ కార్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఈవోడబ్ల్యూ పోలీసులు వేగం పెంచారు.