గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 17 జనవరి 2022 (17:59 IST)

మంత్రి కొడాలి నాని ఇలాకాలో గోవా క్యాసినో కల్చర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి సంబరాలు అంరంగం వైభవంగా జరిగాయి. పేకాట, కోడిపందాలు, తదితర పందాల్లో మూడు రోజుల్లో కోట్లాది రూపాయల మేరకు చేతులు మారాయి. ముఖ్యంగా, రాష్ట్ర పౌరసరఫరాల మంత్రిత్వ శాఖామంత్రి కొడాలి నాని సొంత నియోజకవర్గమైన గుడివాడలో గోవా క్యాసినో కల్చర్ స్పష్టంగా కనిపించింది. గోవాను తలదన్నే రీతిలో క్యాసినో ప్రోగ్రామ్ నిర్వహించి రచ్చరచ్చ చేశారు. 
 
ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కోడిపందాలు, పేకాటలుదాటి మరో అడుగు ముందుకేసి ఏకంగా క్యాసినో కల్చర్‌ను తీసుకుని రావడం ఇపుడు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎవరికివారే తగ్గేదే లేదంటూ మందేసి చిందేస్తూ క్యాసినో ఆడుతూ కెమెరాలకు అడ్డంగా చిక్కిపోయారు. 
 
ఈ వీడియోలను చూసిన గుడివాడ ప్రజలు ఇపుడు నోరెళ్లబెడుతున్నారు. ఈ క్యాసినో కల్చర్ హాలు ప్రవేశం ద్వారం మొదలుకుని లోపల కల్చరల్ ప్రోగ్రామ్స్ వరకు అంతా గోవాని తలదన్నే రీతిలో కనిపించాయని ఈ కార్యక్రమానికి హాజరైన వారు వాపోతున్నారు.