బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 17 జనవరి 2023 (13:48 IST)

నయంకాని వ్యాధి.. ఆర్థిక ఇబ్బందులు.. భార్యను చంపి.. భర్త ఆత్మహత్య

suicide
దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన భార్యను కట్టుకున్న భర్త చంపేశాడు. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన గుంటూరు జిల్లా పొన్నురు మండలం కసుకర్రు గ్రామంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గ్రామానికి చెందిన తుమ్మంపాటి చిన్న సుబ్బయ్య (50), తుమ్మంపాటి రోజా (45) అనే దంపతులు ఉన్నారు. వీరు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే, గత కొంతకాలంగా ఈ దంపతులిద్దరూ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వచ్చారు. ఎంతో మంది వైద్యుల వద్దకు వెళ్లి చికిత్స చేయించుకున్నప్పటికీ వ్యాధి నయం కాలేదు. 
 
అదేసమయంలో వైద్యం చేయించుకునేందుకు తమ వద్ద డబ్బులు కూడా లేకుండాపోయాయి. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన చిన్నసుబ్బయ్య.. భార్య రోజాను తలపై కర్రతో కొట్టి చంపేశాడు. ఆ తర్వాత తాను కూడా ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. 
 
ఈ దంపతులు తెల్లవారినప్పటికీ బయటకు రాకపోవడంతో ఇరుగుపొరుగువారు వచ్చి చూడగా దంపతులిద్దరూ విగతజీవులుగా కనిపించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు నమోదు చేసిన పొన్నూరు గ్రామీణ పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.