శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 3 జులై 2019 (09:51 IST)

హైదరాబాద్‌లో తప్పిన పెనుముప్పు

హైదరాబాద్ మొజంజాహి మార్కెట్ సర్కిల్‌లో ఆర్టీసి బస్సు బోల్తా పడింది. సిగ్నల్ మలుపు వద్ద లారీ ఢీకొనడంతో బస్సు బోల్తా పడింది. బస్సు డ్రైవర్‌తో సహా ఏడుగురు ప్రయాణీకులకు గాయాలయ్యాయి. బాధితులను స్థానిక ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆ వాహనాన్ని రోడ్డు క్లియర్ చేసి పీఎస్ కు తరలించారు. 
 
టీఎస్ 01 ఎడ్ 0146 సూపర్ లగ్జరీ బస్సు హైదరాబాదు‌లో ఇటీవల కాలంలో ప్రమాదాలు పెరిగాయి. మలుపుల వద్ద సరైన హెచ్చరికల బోర్డులు లేకపోవడం, సరైన భద్రతా చర్యలు లేకపోవడంతో వరుస ప్రమాదాలు జరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. దీనికితోడు మెట్రో రైలు పిల్లర్లు కూడా ప్రయాణీకుల అదృష్టాన్ని పరీక్షిస్తున్నాయి.