ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 6 మార్చి 2021 (10:10 IST)

విజయవాడ ప్రజలకు ఏం కావాలో నాకు తెలుసు, జగన్ అలా సీయం అయ్యారు: శ్వేత కేశినేని

కేశినేని శ్వేత. తెదేపా నుంచి విజయవాడ మేయర్ అభ్యర్థిగా బరిలో నిలిచింది. ఈమె ఇప్పుడు నగరంలో హాట్ టాపిక్‌గా మారారు. ఎక్కడ ప్రచారం చేస్తున్నా ప్రత్యర్థి పార్టీ వైసిపిపై తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధిస్తూ దూసుకువెళ్తున్నారు.
 
తాజాగా ఆమె విజయవాడ 5వ డివిజన్లో పర్యటిస్తూ నేరుగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై విమర్శలు ఎక్కుపెట్టారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి వారసత్వ రాజకీయాలతోనూ, డబ్బుతోనీ సీయం అయ్యారని విమర్శించారు. తను మాత్రం విజయవాడ ఆటోనగర్ కార్మికుల మధ్య పెరిగాననీ, విజయవాడ నగర ప్రజలకు ఏం కావాలో తనకు తెలుసునని చెప్పుకొచ్చారు.
 
అధికారంలోకి వచ్చిన వైసిపి విజయవాడ వాసులకి ఏమయినా చేసిందా... చేస్తే ఏమిటో చెప్పాలన్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో విజయవాడలో తెదేపా ఘన విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు.