బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 6 మే 2023 (10:04 IST)

తమిళనాడు మీదుగా ఉపరితల ద్రోణి.. ఏపీలో వర్షాలు, పిడుగులు

దక్షిణ కర్ణాటక, తమిళనాడు మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతుండటంతో ఏపీలో మరికొన్ని రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. శనివారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఆదివారం పలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 
 
కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం వుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదివారం ప్రకాశం, కృష్ణా, తిరుపతి, బాపట్ల, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని తెలిపింది.