ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 14 అక్టోబరు 2024 (11:27 IST)

మరో వివాదంలో సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం (video)

Koneti Adimulam
Koneti Adimulam
సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మరో వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై నమోదైన అత్యాచారం కేసు హైకోర్టులో ఆయనకు భారీ ఊరట లభించింది. ఈ కేసును కోర్టు కొట్టివేసింది. 
 
ఎమ్మెల్యే ఆదిమూలంపై మహిళ ఆరోపణలు చేసిన వెంటనే తెలుగు దేశం పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో ఎమ్మెల్యే స్వల్ప అస్వస్థతకు గురై చెన్నైలోని ఆస్పత్రిలో చికిత్సపొందారు. ఆ తర్వాత ఆదిమూలంపై తిరుపతి తూర్పు పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
దీంతో ఆయన ఈ కేసును కొట్టేయాలని హైకోర్టును ఆశ్రయించారు. కోర్టులో ఆయనకు ఊరట లభించింది. ఈ కేసు వ్యవహారం సద్దుమణగక ముందే మరో వివాదంలో సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం చిక్కారని తెలుస్తోంది. 
 
ఒక మహిళతో ఫోన్‌లో మాట్లాడుతున్న సంభాషణ లీక్ అయ్యింది. ఫోన్ సంభాషణలో "నువ్వు చాలా అందంగా ఉన్నావని, నీ పర్సనాలిటీ చాలా బావుందని" ఎమ్మెల్యే అన్నారు. ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.