భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పద్దతి మార్చుకోవాలి
భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పద్దతి మార్చుకోవాలని జనసేన నేతలు పేర్కొన్నారు. వీరవాసరం లో ఫోటోకాల్ పాటించాలని, ఎమ్మెల్యే పద్దతి మార్చుకోకుండా యుద్ధం ప్రకటిస్తే, తాము కూడా ప్రజల పక్షాన గ్రంధి శ్రీనివాస్ తో యుద్ధానికి సిద్ధమని వీరవాసరం జనసేన జడ్పిటిసి జయప్రకాష్ నాయుడు హెచ్చరించారు.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం కొణితివాడలో జరిగిన రెండో విడత వైఎస్సార్ ఆసరా ప్రోగ్రాం లో జెడ్పీటీసీ జయ ప్రకాష్ నాయుడు, ఎంపీపీ దుర్గా భవానిలను భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా అవమానించారని ఆరోపించారు. స్థానిక ప్రజాప్రతినిధులకు ఫోటో కాల్ వర్తింపకుండా భీమవరం నుంచి వచ్చిన నేతలను స్టేజి పైన ముందు వరుసలో కూర్చో బెట్టి తమను తీవ్రంగా అవమానించారని చెప్పారు. వీరవాసరం జెడ్పిటిసి, ఎంపిడివో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఎమ్మెల్యే గ్రంధి తీరును తీవ్రంగా తప్పుపట్టారు.
ప్రజాస్వామ్యం లో ప్రజల మద్దతుతో గెలిచిన జడ్పీటీసీ, ఎంపీపీ లను స్టేజి మీదకి వచ్చి మాట్లాడకుండా అడుపడ్డ వైస్సార్ సిపి నాయకులు... మీ పార్టీ వేరు మా పార్టీ వేరు అని మాట్లాకుండా స్టేజి నుంచి దింపేసి అవమానించడం చాలా బాధాకరంగా ఉందన్నారు. ఇదేమి రాజ్యం? మాట్లాడే హక్కు మాకు లేదా అని జనసేన నాయకులు వాపోయారు, మీ తీరు మార్చుకోపోతే చాలా తీవ్ర పరిణామాలు ఎదురుకోవాల్సి ఉంటుంది అని జనసేన నాయకులు హెచ్చరించారు.
పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం మండలం కొణితివాడ లో జరిగిన రెండో విడత వైస్సార్ ఆసరా ప్రోగ్రాం లో వీరవసరం మండల జెడ్పీటీసీ జయ ప్రకాస్ నాయుడు, ఎంపీపీ దుర్గాభవానికి చేదు అనుభవం ఎదురయింది. ప్రజల మద్దతుతో గెలిచిన జడ్పీటీసీ, ఎంపీపీలను కూడా స్టేజి మీదకి వచ్చి మాట్లాడకుండా అడుపడ్డ వైస్సార్ సిపి నాయకులను వారు దుయ్యబడుతున్నారు. కనీసం ప్రోటోకాల్ ను కూడా అనుసిరించకుండా జనసేన పార్టీ అని ఒకే ఒక్క కారణం తో స్టేజి మీద మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు. ఆ సభలో భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కూడా వారని అనుమతించకుండా, స్టేజి నుంచి దింపేసి అవమానించడం చాలా బాధాకరం అన్నారు. మీ తీరు మార్చుకోపోతే చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయని జనసేన నాయకులు హెచ్చరించారు.