శనివారం, 9 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 8 నవంబరు 2024 (16:18 IST)

కుర్చీ కోసం రచ్చ చేసిన మాధవీ రెడ్డి.. ఈ కన్ను గీటడం ఏంటంటున్న వైకాపా.. నిజమెంత? (video)

Madhavi Reddy
Madhavi Reddy
కడప కార్పొరేషన్​లో ఒక మహిళ ఎమ్మెల్యేగా తనకు కుర్చీ లేకుండా అవమానించినా వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని మాధవీ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజల కోసం ఎక్కడ కూర్చునైనా పోరాటం చేస్తానని, వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు పాలకవర్గం అవమానించినంత మాత్రాన భయపడిపోయే వ్యక్తిని కాదని తేల్చి చెప్పారు. కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో మాధవీ రెడ్డి నిరసన వ్యక్తం చేశారు. దీంతో గందరగోళం నెలకొంది. సమావేశం గందరగోళంగా మారడంతో వాయిదా వేసి మేయర్ బయటకు వచ్చారు. 
ఈ సందర్భంగా మాధవి మీడియాతో మాట్లాడుతూ.. "సమావేశంలో మహిళను అవమానపరుస్తారా? మీరు లాగేసినా ప్రజలు నాకు కుర్చీ ఇచ్చారు. కుర్చీల కోసం పోరాడాల్సిన అవసరం నాకు లేదు. సమావేశమంతా నిలబడి మాట్లాడే శక్తి నాకుంది. అహంకారం, అధికారం ఎక్కువైతే ఎలా ప్రవర్తిస్తారో చూస్తున్నాం." అన్నారు. 
 
అయితే మాధవీరెడ్డిపై వైకాపా వేరేవిధంగా నిప్పులు చెరుగుతోంది. కడప కార్పొరేషన్‌ పాలకవర్గ సమావేశంలో.. మేయర్‌ సురేష్ గారితో సమానంగా కుర్చీ కావాలంటూ కావాలనే మాధవిరెడ్డి రచ్చ చేశారని అంటోంది వైకాపా. 
 
గతంలో కడప కార్పొరేషన్‌కు ఓ ఐఏఎస్‌ అధికారి కమిషనర్‌గా ఉండేవారు. మాధవిరెడ్డి ఎమ్మెల్యే అయ్యాక తమ బంధువునే కార్పొరేషన్‌ కమిషనర్‌గా గ్రూప్‌ 1 అధికారి మనోజ్‌రెడ్డిని పట్టు పట్టి మరీ నియామకం చేయించుకున్నారు. 
 
ఇంకా కుర్చీ కోసం కమిషనర్‌ వైపు చూస్తూ గొడవ కొనసాగాలంటూ కన్నుగీటిన వీడియోను వైకాపా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. పక్కా స్కెచ్‌తో రచ్చ చేసిందనడానికి ఈ కన్ను గీటడం కంటే నిదర్శనం ఏం కావాలి? అంటూ వైకాపా ప్రశ్నించింది. గతంలో పలు సందర్భాల్లో ఆమె కన్ను గీటిన వీడియోలను షేర్ చేసింది.