శనివారం, 14 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 8 నవంబరు 2024 (14:25 IST)

మళ్లీ గెలుస్తాం, టీడీపికి బుద్ధి చెపుదాం అంటూ విజయసాయిరెడ్డి పోస్ట్, నెటిజన్స్ ఏమంటున్నారు?

vijayasaireddy
సోషల్ మీడియాలో కాస్త క్రమశిక్షణ కనిపిస్తున్నట్లు అనిపిస్తుంది. వైసిపి సీనియర్ నాయకుడు విజయసాయి రెడ్డి " కష్టాలు కొత్తేం కాదు.. గతంలో ఉన్నాయి.. ఇప్పుడు ఉన్నాయి... భవిష్యత్తులో కూడా ఉంటాయి. ఎన్నో కష్టాలని, బాధల్ని ఎదుర్కొని నిలబడ్డ పార్టీ మన వైస్సార్సీపీ. నిలబడతాం.. తలపడతాం... పోరాడుతాం.... మళ్ళీ గెలుస్తాం.... టీడీపీకి బుద్ధి చెపుదాం.'' అంటూ ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు.
 
ఈ పోస్టుపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఐతే అసభ్య పదజాలం దాదాపుగా కనపడటంలేదు. మొత్తమ్మీద సోషల్ మీడియాలో నాయకులు చేస్తున్న పోస్టులకు తగు రీతిలో స్పందన వస్తుందటం కాస్త చూసేందుకు ఆరోగ్యకరంగా వున్నది.