బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 23 మే 2020 (22:56 IST)

లాక్‌డౌన్‌లో సీజ్‌ చేసిన వాహనాలను విడిచిపెట్టండి: సీఎం ఆదేశం

లాక్‌డౌన్‌ నియమ నిబంధనలను ఉల్లంఘించినందుకు సీజ్‌చేసిన వాహనాలను విడుదల చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పోలీసులను ఆదేశించారు.

ఈ సందర్భంగా మళ్లీ నియమాలను ఉల్లఘించబోమంటూ వాహనదారుల నుంచి హామీపత్రాన్ని తీసుకోవాలని అన్నారు. లాక్‌డౌన్‌ పరిస్థితులపై అధికారులతో జరిగిన సంభాషణలో సీఎం ఈ ఆదేశాలు ఇచ్చారు.

రూ.100 జరిమానాకు పరిమితం చేయాలని సీఎం అధికారులకు స్పష్టంచేశారు. వాహనాలు వారికి అప్పగించేటప్పుడు కోవిడ్‌–19 నివారణా జాగ్రత్తలపై అవగాహన కూడా కల్పించాలన్నారు.