శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 9 డిశెంబరు 2020 (07:30 IST)

గుడివాడలో ప్రభుత్వాసుపత్రి ఏర్పాటుకు మంత్రి కొడాలి నాని చర్యలు

గుడివాడలో జిల్లా ప్రభుత్వాసుపత్రి ఏర్పాటుకు రాష్ట్ర పౌరసరఫరాలు,వినియోగదారుల కొడాలి వెంకటేశ్వరరావు (నాని) చర్యలు చేపట్టారు. గుడివాడ రూరల్ మండలం మల్లాయిపాలెం పరిధిలో 181 ఎకరాల అర్బన్ లేఅవుట్ లో జిల్లా ప్రభుత్వాసుపత్రికోసం 9. 33 ఎకరాలను కేటాయించారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్య, ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది.

దీనిలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేస్తూ 2,434 వ్యాధులకు కార్పోరేట్ స్థాయి ఆసుపత్రుల్లో ఉచిత వైద్య సేవలందిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 11 వైద్య కళాశాలలు వ్యవహారాల శాఖ మంత్రి ఉన్నాయి. వీటితో పాటు రాష్ట్రంలో కొత్తగా 16 వైద్య కళాశాలలు, నర్సింగ్ కాలేజ్ లు, మూడు కేన్సర్ ఆసుపత్రులు, రెండు కిడ్నీ స్పెషాలిటీ ఆసుపత్రులు, గిరిజనులకు ఐటీడీఏ పరిధిలో ఆరు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తున్నారు.

దీనిలో భాగంగా జిల్లాలోమచిలీపట్నానికి మెడికల్ కళాశాలను కేటాయించారు. దీంతో మంత్రి కొడాలి నాని గుడివాడలో జిల్లాప్రభుత్వాసుపత్రిని ఏర్పాటు చేయాలని సీఎం జగన్మోహనరెడ్డిని కోరగా అందుకు ఆయన అంగీకరించారు. గుడివాడకు జిల్లా ఆసుపత్రి వస్తే భవిష్యత్తులో మెడికల్ కళాశాల కూడా మంజూరయ్యే వకాశాలుంటాయన్నఆలోచనతో భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని 30 ఎకరాల భూమిని మంత్రి కొడాలి నాని కొనుగోలు చేయించారు.

దీనిలో 9.33 ఎకరాలను జిల్లా ఆసుపత్రిని కేటాయించారు. మిగతా భూమిని మెడికల్కళాశాలకు వినియోగించే ఆలోచనలో మంత్రి కొడాలి నాని ఉన్నారు. ఇదిలా ఉండగా అర్బన్ లేఅవుట్లో జిల్లా ప్రభుత్వాసుపత్రి, మెడికల్ కాలేజ్ ఏర్పాటుకు కేటాయించిన స్థలాన్ని మంగళవారం స్థానిక రాజేంద్రనగర్లోని నివాసంలో మంత్రి కొడాలి నాని పరిశీలించారు.

ఈ సందర్భంగా మండల సర్వేయర్, రెవెన్యూ ఇన్స్ పెక్టర్లకు పలు సూచనలుఇచ్చారు. అనంతరం మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి జిల్లా, నియోజకవర్గం,గ్రామంలో సుమారు 2 వేల జనాభా ఆరోగ్య అవసరాలను తీర్చే విధంగా గ్రామస్థాయిల్లో వైఎస్సార్ విలేజ్క్లినిక్స్ దగ్గర నుండి మెడికల్ కాలేజ్ వరకు అంచెలవారీ వ్యవస్థను సీఎం జగన్మోహనరెడ్డి ప్రజల ముందు ఉంచారన్నారు.

దీనిలో భాగంగానే ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో టీచింగ్ ఆసుపత్రి, నర్సింగ్కళాశాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. నాడు-నేడులో భాగంగా ప్రభుత్వాసుపత్రులరూపురేఖలను ప్రభుత్వం సమూలంగా మార్చివేసిందన్నారు. 10 వేల 032 వైఎస్సార్ విలేజ్ క్లినిక్లు, 560 అర్బన్ క్లినిక్స్ నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.

1,147 పీహెచ్ సీలు, 52 ఏరియా ఆసుపత్రులు, 191 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నారన్నారు. 1,088 కొత్త 104, 108 సర్వీసు రాష్ట్ర నలుమూలల్లో సేవలందిస్తున్నాయని, ఆసుపత్రుల్లో అవసరమైన వైద్య సిబ్బంది నియామకం కూడా జరుగుతోందన్నారు. గుడివాడలో కూడా జిల్లా ఆసుపత్రిని నెలకొల్పి ఈప్రాంత ప్రజలకు విస్తృతంగా వైద్య సేవలందేలా చూస్తామని, భవిష్యత్తులో ఈ ఆసుపత్రికి అనుబంధంగామెడికల్ కాలేజ్ మంజూరుకు కృషి చేస్తానని మంత్రి కొడాలి నాని చెప్పారు.

గుడివాడ పట్టణంలో పేదలకు 16,678 ఇళ్ళు, ఇళ్ళపట్టాల పంపిణీకి సన్నాహాలు
గుడివాడ పట్టణంలో అర్హులైన 16,678 కుటుంబాలకు ఇళ్ళు, ఇళ్ళపట్టాలపంపిణీకి రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి నాని సన్నాహాలు ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 25 వ తేదీన 30.75 లక్షల ఇళ్ళస్థలాలకు పట్టాలిచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

దీనిలో భాగంగా గుడివాడ పట్టణంలోని లబ్ధిదారులకు రూరల్ మండలం మల్లాయిపాలెం పరిధిలోని 77 ఎకరాల్లో నిర్మిస్తున్న 8,912 టిడ్కో ఇళ్ళు, 7,766 ఇళ్ళస్థలాలకు పట్టాలను అందజేయనున్నారు. మంత్రి కొడాలి నాని తొలిసారి ఎమ్మెల్యేగా గెల్చిన వెంటనే గుడివాడ నియోజకవర్గంలో ఇళ్ళస్థలాల సమస్యను ముందే గుర్తించారు.

ఎంత మంది హేళన చేసినా 10 వేల మంది పేదలకు ఇళ్ళపట్టాలివ్వాలని 2007 వ సంవత్సరంలో మంత్రి కొడాలి నాని గుడివాడ పట్టణం నుండి హైదరాబాద్ కు పాదయాత్ర చేపట్టి అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డిని కలిసి వినతిపత్రాన్ని అందించారు.

ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్న కొడాలి నాని పాదయాత్రగా ఇంత దూరం వచ్చారంటే గుడివాడలో ఇళ్ళస్థలాల సమస్య ఉందని దివంగత రాజశేఖరరెడ్డి భావించి 2008 వ సంవత్సరంలో మల్లాయిపాలెం పరిధిలో 77 ఎకరాల భూమిని కొనుగోలు చేయించారు. దీనికి మంత్రి కొడాలి నాని రైతులతో మాట్లాడి ఒప్పించడంతో నేడు ఈ ప్రాంతంలో 8,912 టిడ్కో గృహాలను నిర్మించడం జరుగుతోంది.

సీఎం జగన్మోహనరెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో సొంతిల్లు లేని నిరుపేద ఉండకూడదన్న ఉద్దేశ్యంతో 30.75 లక్షల ఇళ్ళపట్టాల పంపిణీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పలుమార్లు ఈ కార్యక్రమం వాయిదా పడినప్పటికీ డిసెంబర్ 25 న పంపిణీ చేస్తామని సీఎం జగన్మోహనరెడ్డి ప్రకటించారు. దీనిలో భాగంగా 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించే టిడ్కో గృహాలను రూ.1కే అందజేస్తామని, బ్యాంక్ రుణం కూడా చెల్లించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

దీంతో గుడివాడ పట్టణంలో 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించే 1,056 టిడ్కో గృహాలు రూ. 1కే లబ్ధిదారులకు అందనున్నాయి. టిడ్కో గృహాలను ఆనుకుని రెండు విడతల్లో మరో 181 ఎకరాల భూములను సీఎం జగన్మోహనరెడ్డి ఆదేశాలతో మంత్రి కొడాలి నాని కొనుగోలు చేయించారు. ఈ భూముల్లో 7,766 మంది లబ్ధిదారులకు ఇళ్ళస్థలాలను కేటాయించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

రేయింబవళ్ళు శ్రమించి 181 ఎకరాల్లో దాదాపు 100 ఎకరాలకు ఫిల్లింగ్ పనులను మంత్రి కొడాలి నాని పూర్తిచేయించారు. దాదాపు 4 వేల స్థలాలకు మార్కింగ్ పనులు కూడా పూర్తయ్యాయి. డిసెంబర్ 25 వ తేదీ నాటికి అర్హులైన లబ్ధిదారులకు టిడ్కో గృహాలు, ఇళ్ళస్థలాలను కేటాయించే పనిలో మంత్రి కొడాలి నాని నిమగ్నమయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ ఈ నెల 25 వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా 15.6 లక్షల ఇళ్ళ నిర్మాణం ప్రారంమవుతుందని, జనవరి 7 వ తేదీ వరకు శంఖుస్థాపన కార్యక్రమాలు జరుగుతాయన్నారు. 175 నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి 8,914 ఇళ్ళ చొప్పున నిర్మాణ పనులు జరుగుతాయని తెలిపారు.

2వ విడతలో 12.7 లక్షల ఇళ్ళనిర్మాణం జరుగుతాయని, వచ్చే మూడేళ్ళలో ఆయా నిర్మాణాలు పూర్తయ్యేలా ప్రభుత్వం ప్రణాళికను రూపొందించినట్టు మంత్రి కొడాలి నాని తెలిపారు.