గురువారం, 10 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 12 ఫిబ్రవరి 2022 (18:02 IST)

చంద్రబాబుకు.. ఇది చెంపపెట్టు.. కేసీఆర్‌కి కితాబిచ్చిన ఎమ్మెల్యే రోజా

ఏపీ విభజన సమస్యల పరిష్కారంపై కేంద్రం కమిటీ వేసిన నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా వద్దని ప్యాకేజీతో రాజీపడ్డ చంద్రబాబుకు.. ఇది చెంపపెట్టు అని ఎమ్మెల్యే రోజా అన్నారు. మన కష్టం, నష్టం గమనించి కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని వివరించారు. 
 
వెనుకబడిన ప్రాంతాలకు నిధులు ఇవ్వాలని, ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలో హామీలను అమలు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు రోజా. విభజన సమస్యల పరిష్కారం కోసం సీఎం జగన్ చేసిన పోరాటానికి ఫలితం దక్కనుందని రోజా చెప్పారు. 
 
ఏపీ విభజన సమస్యల పరిష్కారంపై కేంద్రం కమిటీ వేయడం శుభపరిణామం అని రోజా తెలిపారు. ఇది సీఎం జగన్ సాధించిన విజయంగా అభివర్ణించారు. గత నెల కూడా సీఎం జగన్ విభజన సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారని రోజా చెప్పారు.
 
మరోవైపు యాదాద్రి ఆలయాన్ని సీఎం కేసీఆర్ అద్బుతంగా నిర్మాణం చేస్తున్నారని నగిరి ఎమ్మెల్యే రోజా కొనియాడారు. శనివారం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి రోజా దర్శించుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఈ కాలంలో ఏవరికి దక్కని అవకాశం కేసీఆర్‌కు దక్కిందన్నారు. 
 
రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సంతోషించే విధంగా ఆలయం నిర్మాణం జరిగిందని తెలిపారు. ఇక్కడికి తీసుకువచ్చిన రాయి గుంటూరు నుంచి తీసుకు వచ్చారని, ఎప్పటికీ తెలుగువారు అన్నదముళ్ళు, అక్కచెల్లెలుగా కలిసి ఉంటారని రోజా స్పష్టం చేశారు.