గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , గురువారం, 28 అక్టోబరు 2021 (18:25 IST)

సీఎం జగన్‌కు నారా లోకేశ్ బహిరంగ లేఖ.,,,విద్యార్థుల కోసం పోరాటం చేస్తా...

ఎయిడెడ్ పాఠశాలల మూసివేతపై సీఎం జ‌గ‌న్ కు నారా లోకేష్ లేఖ రాసారు. ఎయిడెడ్ విద్యా సంస్థల ఆస్తులపై ప్రభుత్వం దృష్టి సారించాల‌ని డిమాండు చేశారు. సీఎం అనాలోచిత నిర్ణయాలతో ఎయిడెడ్ స్కూళ్లు మూతపడుతున్నాయ‌ని, దీంతో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. 

 
విద్యావేత్త‌ల‌తో సంప్రదింపులు లేకుండానే ప్రభుత్వ కమిటీ నివేదిక ఇచ్చిందని, కమిటీ నివేదికపై వస్తున్న ఆరోపణలపై విచారణ జరపాని డిమాండు చేశారు. ఎయిడెడ్ విద్యా సంస్థల్ని యథావిధిగా కొనసాగించాల‌ని, తొలగించిన కాంట్రాక్ట్ లెక్చరర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాల‌ని డిమాండు చేశారు. ఎయిడెడ్ విద్యా సంస్థల మూసివేతపై తల్లిదండ్రుల నిరసనలు తెలుపుతున్నార‌ని, విద్యా సంస్థలను పేదలకు దూరం చేయడాన్ని టీడీపీ వ్యతిరేకిస్తోంద‌రి లోకేష్ చెప్పారు. పేద విద్యార్థులకు న్యాయం జరిగేవరకు పోరాటం చేస్తామ‌ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలిపారు.