సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వి
Last Modified: బుధవారం, 22 జులై 2020 (22:57 IST)

మాస్క్ వేసుకోలేదని చీరాల యువకుడిని చితక్కొట్టిన ఎస్సై, మృతి

ప్రకాశం జిల్లా చీరాల టూటౌన్ ఎస్సై ఓవర్ యాక్షన్‌తో రెచ్చిపోయాడు. ప్రకాశం జిల్లా టూటౌన్ ఎస్సై విజయకుమార్ అత్యుత్సాహం యువకుడి ప్రాణాన్ని బలిగొన్నది. ఈ నెల 18న మాస్క్ లేకుండా తిరుగుతున్నాడని కిరణ్ కుమార్ అనే యువకుడ్ని ఎస్సై విజయకుమార్ చితకబాదాడు. యువకుడు తీవ్ర గాయాలకు గురైయ్యాడు.
 
దీంతో కుటుంభ సభ్యులు చికిత్స కోసం గుంటూరు ఆస్పత్రికి తరలించారు. గుంటూరులో చికిత్స పొందుతూ కిరణ్ కుమార్ మృతి చెందాడు. అయితే పోలీసులు లాఠీలతో కొట్టారని ఆ దెబ్బల కారణంగానే కిరణ్ కుమార్ మృతి చెందారని కుటుంబ సభ్యులు ఆరోపించారు.
 
కిరణ్ తండ్రి మోహన రావు చీరాలలో రేషన్ డీలర్‌గా పనిచేస్తున్నారు. చీరాల ఎస్సై విజయకుమార్ పై దళిత సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. ఎస్సై విజయకుమార్ పైన హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చెయ్యాలని డిమాండ్ చేసారు.