శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 7 జూన్ 2018 (16:26 IST)

సరదా కోసం రాజకీయాల్లోకి రాలేదు.. అందుకే వచ్చా : పవన్ కళ్యాణ్

తాను రాజకీయాల్లోకి సరదా కోసం రాలేదని, గిరిజన సమస్యలను చూసి కడుపుమండటం వల్లే జనసేన పార్టీని స్థాపించడం జరిగిందని ఆ పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్ ప్రకటించారు. జనసేన ప్రజా పోరాట యాత్ర విశాఖపట్టణం జిల్

తాను రాజకీయాల్లోకి సరదా కోసం రాలేదని, గిరిజన సమస్యలను చూసి కడుపుమండటం వల్లే జనసేన పార్టీని స్థాపించడం జరిగిందని ఆ పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్ ప్రకటించారు. జనసేన ప్రజా పోరాట యాత్ర విశాఖపట్టణం జిల్లాలోని మన్యం ప్రాంతంలో కొనసాగుతోంది. ఇందులోభాగంగా గురువారం పాడేరులో ఆయన రోడ్‌షో నిర్వహించారు.
 
ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ, తానేదో సరదా కోసం రాజకీయాల్లోకి రాలేదని, ప్రజల్లో రాజకీయ చైతన్యం తీసుకొచ్చేందుకే వచ్చానన్నారు. డిగ్రీలు పూర్తి చేసుకున్న యువతకు సరైన ఉపాధి మార్గాలు లేకపోవడంవల్లే పక్కదారి పడుతున్నారని అన్నారు. ఐటీడీఏ ఉపాధి మార్గాలు చూకపోవడం దారుణమని ఆరోపించారు. ఉత్తరాంధ్రలో గిరిజన సమస్యలతో కడుపు మండే జనసేన పార్టీ ఆవిర్భవించిందన్నారు.