ఈసారి సీఎం జగన్ పైన పొగడ్తలు జల్లు కురిపించిన జనసేన చీఫ్ పవన్
ప్రజా వ్యతిరేక విధానాలకు ఎవరు పాల్పడినా వదిలేదు లేదు. ఖచ్చితంగా పోరాటం చేస్తాం. ప్రజలను చైతన్యవంతులను చేస్తాం. ప్రభుత్వంపై వ్యతిరేకత తీసుకువస్తాం. వారి మెడలు వంచుతాం ఈ డైలాగ్‌లు ఎవరు చెప్పి ఉంటారో పెద్దగా చెప్పనక్కర్లేదు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.
ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలపై ఇప్పటికే విమర్శలు చేస్తూ ప్రకటనలు విడుదల చేస్తున్నారు పవన్ కళ్యాణ్. తాజాగా నిరుపేద కాపులకు ప్రభుత్వం అండగా నిలవడం.. నిధులు ఇవ్వడం.. అయితే అందులో పూర్తిస్థాయిలో కాపులకు న్యాయం జరగలేదన్న అభిప్రాయాన్ని పవన్ కళ్యాణ్ వ్యక్తం చేశారు.
ఎప్పుడూ ప్రభుత్వంపై విమర్సలు చేసే పవన్ మొదటి సారి ఎపి సిఎంను పొగడ్తలతో ముంచెత్తారు. అది కూడా 104, 108 ఆంబులెన్స్‌ల కొనుగోళ్ళపై.. నిరుపేద రోగులకు ఆ ఆంబులెన్స్‌లు ఏ విధంగా ఉపయోగపడతాయో అర్థం చేసుకున్నారు పవన్ కళ్యాణ్. అందుకే జగన్ గారు. వెరీ గుడ్.. మీ ఆంబులెన్స్ సర్వీసులను స్వాగతిస్తున్నా.
ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆపదలో ఉన్న వారికి ఆంబులెన్స్‌లు ఎంతో ముఖ్యం. కొత్త ఆంబులెన్స్‌ల కొనుగోలు వాటిని పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా సిబ్బందిని నియమించి ఫోన్ చేస్తే క్షణాల్లో వాలిపోయి బాధితులను ఆదుకునేలా చేస్తున్న ప్రయత్నం చాలా బాగుంది అంటూ మెచ్చుకున్నారు.