శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 21 మే 2022 (10:56 IST)

కోనసీమ జిల్లా పేరు మార్పు - వ్యతిరేకిస్తున్న ప్రజలు

konaseema
కోనసీమ జిల్లా పేరును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మార్చింది. దీనిపై కోనసీమ వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఏపీ ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. ఇందులో ఒకటి కోనసీమ. ఇపుడు ఈ జిల్లా పేరును మార్చింది. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా కొత్త పేరు పెట్టింది. దీన్ని స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. 
 
ఎన్నో యేళ్లుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పటి నుంచి కోనసీమ ప్రాంతానికి ప్రత్యేక స్థానం ఉందని అలాంటి పేరును మార్చేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరికాదంటూ నినాదాలు చేస్తున్నారు. దీంతో కోమసీ ఉద్యమ సమితి ఆధ్వర్యంలో శుక్రవారం అమలాపురంలో పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. 
 
జిల్లా పేరు మార్పును వ్యతిరేకిస్తూ ఉద్యమం చేస్తామని ప్రకటించారు. దీంతో జిల్లా కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా, పి గన్నవరం, అంబాజీపేట, బండారులంక, అమలాపురం పట్టణాల్లో శుక్రవారం స్థానికులు పెద్ద ఎత్తున రహదారులపైకి వచ్చి నినాదాలు చేస్తూ పాదయాత్రగా జిల్లా కలెక్టరేట్ వద్దకు దాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు. 
 
దీంతో ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు నానా ఇబ్బందులు పడ్డారు. ఆందోళనకారులు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. అదేసమయంలో కార్యాలయంలో కలెక్టర్ లేకపోవడంతో డీఆర్వో సత్తిబాబుకు వినతిపత్రం ఇచ్చి వెనుదిరిగారు.