1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 17 మార్చి 2023 (18:00 IST)

ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైకిల్ జోరు.. రాయలసీమలో పోటాపోటీ

ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైకిల్ జోరు కొనసాగుతోంది. ఏపీలో గ్రాడ్యయేట్స్ మూడు స్థానాల ఎన్నికల ఓట్ల కౌంటింగ్ కొనసాగుతోంది. ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ స్థానాల్లో టీడీపీ హవా కనిపిస్తుండగా.. పశ్చిమ రాయలసీమలో వైకాపా-టీడీపీ పోటీపడుతున్నాయి. 
 
ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో నాలుగు రౌండ్లు పూర్తయ్యేసరికి టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు ముందంజలో ఉన్నారు. 
 
సమీప ప్రత్యర్థి, వైస్సార్సీపీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్‌పై ప్రస్తుతం 18,371 ఓట్ల భారీ ఆధిక్యంలో వున్నారు. రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ టీడీపీ ముందంజలో వుంది.