మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 20 జనవరి 2021 (12:17 IST)

పేకాట రాయుళ్లను పట్టుకున్న ఎస్ఐ ఆత్మహత్య చేసుకునేలా చేశారు : దేవినేని ఉమ

గుడివాడలో పేకాట రాయుళ్లను పట్టుకున్న ఎస్ఐ ఆత్మహత్య చేసుకునేలా చేశారని వైకాపా నేతలపై టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వర రావు ఆరోపించారు. అంతేకాకుండా ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి జగన్ ఏం సాధించారంటూ సూటిగా ప్రశ్నించారు. 
 
ఎన్టీఆర్ విగ్రహం ధర్నా చేసేందుకు యత్నించిన దేవినేని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. దీనిపై మాజీ మంత్రి దేవినేని స్పందిస్తూ, సీఎం జగన్‌.. ఢిల్లీ వెళ్లి ఏం సాధించారని ఘాటుగా ప్రశ్నించారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను అపహాస్యం చేస్తున్నారని విమర్శించారు. 
 
వైసీపీ ప్రభుత్వ పాలనలో పోలీసులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, పేకాట రాయుళ్లను పట్టుకున్న ఎస్‌ఐ ఆత్మహత్య చేసుకునేలా చేశారని ఆయన ఆరోపించారు. ఏపీ డీజీపీ సవాంగ్ వైసీపీ ప్రభుత్వానికి తొత్తుగా మారారని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అధికారులు రాష్ట్ర ప్రజల కోసం పని చేయడం లేదని, జగన్ కోసం పని చేస్తున్నారని విమర్శించారు.