సోమవారం, 15 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 16 ఫిబ్రవరి 2022 (13:41 IST)

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి నక్కా ఆనందబాబు లేఖ

టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్, మద్యం అమ్మకాలు, రాష్ట్రంలో మహిళలపై వేధింపులు, హత్యలు, అత్యాచారాలపై లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ మాఫియా విచ్చలవిడిగా చెలరేగిపోతోందని చెప్పారు. ‎ఆన్ లైన్‌లో కూడా గంజాయి విక్రయాలు జరుగుతున్నాయంటే ‎ రాష్ట్రంలో పరిస్థితి ఏవిధంగా ఉందో తేటతెల్లమవుతోందని లేఖలో వివరించారు నక్కా ఆనందబాబు.
 
దేశంలో ఏమూలన గంజాయి పట్టుబడినా దాని మూలాలు ఏపీలో ఉంటున్నాయి. దీని వల్ల రాష్ట్ర యువత భవిష్యత్‌తో పాటు రాష్ట్ర ప్రతిష్ట మసకబారుతోందని లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రూ. 9,251 కోట్ల విలువైన 2 లక్షల కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని కాల్చివేశామని పోలీసులు చెబుతున్నారు.
 
కేవలం దొరికిన గంజాయి ఇన్ని లక్షల్లో ఉంటే ఇక దొరకని గంజాయి ఎన్ని లక్షల కిలోల్లో ఉంటుంది? గతంలో విశాఖ మన్యంలో కేవలం వందల ఎకరాల్లో జరిగే గంజాయి సాగు వైసీపీ పాలనలో 15 వేల ఎకరాలకు విస్తరించింది. వైసీపీ నేతలు అక్రమ సంపాదన కోసం మన్యంలో గంజాయిని వాణిజ్య పంటగా మార్చుకుని ‎అమాయకులైన గిరిజనుల్ని వేధింపులకు గురి చేస్తున్నారు.