మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 27 సెప్టెంబరు 2019 (07:41 IST)

ఉద్యోగాల విప్లవం తీసుకురావడమే లక్ష్యం.. రోజా

రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి  రాష్ట్రాన్ని పారిశ్రామిక అభివృద్ది విప్లవంలా తీసుకొనివచ్చి, యువతకు ఉద్యోగాల విప్లవం సృష్టించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని,  దీనికి నిదర్శనం నేడు 100 రోజుల్లో  టి. సి.  ఎల్. యూనిట్ కు  శంకుస్థాపన  చేయడమేనని  ఏపిఐఐసి ఛైర్మన్  ఆర్.కె. రోజా అన్నారు.

ఏర్పేడు మండలం, వికృతమాల  వద్ద టి. సి. ఎల్.  సంస్థ పరిశ్రమల స్థాపనకు  భూమి పూజా కార్యక్రమంలో ఛైర్మన్, స్థానిక శాసన సభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. 
 
ఎపిఐఐసి ఛైర్మన్  మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి  ఆశయం  పారిశ్రామిక  అభివృద్ది లక్ష్యంగా  ముందుకు సాగుతున్నారని అన్నారు.

వికృతమాల వద్ద ప్రభుత్వం 139 ఎకరాలు టిసిఎల్ సంస్థ కు కేటాయించిందని, ప్రపంచంలోనే  పేరొందిన సంస్థ చైనా దిగ్గజం టి.సి.ఎల్.అని తన వ్యాపారులను 160 దేశాల్లో సాగిస్తున్నదని అన్నారు.