Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్‌పై ఫైర్ అయిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ.. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి

Written By సెల్వి
Updated: శనివారం, 6 సెప్టెంబరు 2025 (20:08 IST)
Varma
వైసీపీ అధినేత జగన్‌పై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తీవ్రస్థాయిలో విమర్శించారు. రైతులకు అవసరమైనంత యూరియా అందుబాటులో ఉందని, వాస్తవాలను తెలుసుకోకుండా జగన్ విమర్శలు చేయడం తగదని ఆయన హితవు పలికారు. 
 
పిఠాపురంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. యూరియా కొరత పేరుతో అనవసర రాద్ధాంతం చేస్తూ రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని వర్మ తెలిపారు. కాకినాడ జిల్లాకు మొత్తం 23,359 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా, ఇప్పటికే 19,385 మెట్రిక్ టన్నులను సొసైటీల ద్వారా రైతులకు పంపిణీ చేశామని ఆయన గణాంకాలతో సహా వివరించారు. 
 
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎమ్మార్పీ ధరల కంటే అధిక ధరకు యూరియాను అమ్ముకొని రైతులను దోచుకున్నారని వర్మ ఆరోపించారు. ఇప్పుడు తమ కూటమి ప్రభుత్వంలో రైతులకు ఎమ్మార్పీ రేటుకే యూరియా అందుతుంటే, ఆ వాస్తవం జగన్‌కు కనిపించకపోవడం సిగ్గుచేటని ఆయన ఎద్దేవా చేశారు. 2019 నుంచి 2024 వరకు రైతులకు పూర్తిస్థాయిలో యూరియాను అందించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు.

అన్నీ చూడండి

Yami Gautam: చలాకి కోడలు గా యామీ గౌతమ్ చిత్రం నయ్యి నవెల్లి

Anil Ravipudi: వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ చిత్రం పేరు జనవరి 12 విడుదల

Shravan Reddy: అగధ లో హీరోగా, యాంటీ హీరోగా సర్‌ప్రైజ్ చేస్తున్న శ్రవణ్ రెడ్డి

Vedha Jalandhar: బిర్యానీ ప్రధాన ఆకర్షణ అయినప్పటికీ, ఆమిర్ లోగ్ మహిళలకు స్ఫూర్తినిస్తుంది: వేధా జలంధర్

జానీ మాస్టర్‌పై నిషేధం కొనసాగుతుంది : ఫిల్మ్ ఫెడరేషన్

తర్వాతి కథనం
Show comments