గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 1 మే 2020 (15:48 IST)

విజయవాడ వారధిపై వాహన రాకపోకలు నిలిపివేత

తాడేపల్లి వైపు నుండి కనక దుర్గమ్మ వారధి మీదుగా విజయవాడ వైపు వెళ్లే అన్ని రకాల వాహన రాకపోకలు ను నిషేధిస్తున్నట్లు తాడేపల్లి పోలీసులు గురువారం రాత్రి జిల్లా సరిహద్దు వారధి చెక్ పోస్ట్ వద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.

అత్యవసర వాహనాలు, పాస్ లు ఉన్నవారినే అనుమతిస్తామని తెలిపారు. కరోన కట్టడి కోసం ఇప్పటికే ప్రకాశం బ్యారేజ్ పై రాకపోకలు ను పూర్తిగా నిషేధించిన సంగతి తెలిసిందే.